టాలీవుడ్ లో ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్స్ వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు. అయితే, కొన్ని సంవత్సారాలు మాత్రమే కొంతమంది హీరోయిన్స్ తమ సత్తాని చాటుతుంటారు. అందులోనూ దశాబ్దకాలంగా అగ్రహీరోయిన్ గా కొనసాగిన నటీమణులు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. అందులో ముఖ్యంగా కాజల్ అగర్వాల్ తనదైన గ్లామర్ తో గత పదిసంవత్సరాల నుంచి ఇటు టాలీవుడ్ లోనూ, అటు కోలీవుడ్ లోను తన అందంతో, అభినయంతో నిలదొక్కుకుంది.
ఇటీవలే కాజల్ సూపర్ స్టార్స్ అయిన మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లతో కూడ నటించి అగ్రహీరోయిన్ జాబితాలోకి చేరిపోయింది. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఇప్పుడు అమ్మడి చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడ లేకపోవడంతో ఇక అమ్మడికి ఆఖరి ఛాన్స్ అంటున్నారు సినీ విశ్లేషకులు.
ఇటీవలే బాలీవుడ్ లో యాక్ట్ చేసిన దోలబ్జోన్ కీ కహాని సినిమాతో అమ్మడు తన అదృష్టాన్ని బాలీవుడ్ లో పరీక్షించుకోనుంది. ఈ సినిమా హిట్ అయితే బాలీవుడ్ లో మరో రెండు మూడు ఆఫర్లు రావడం ఖాయంగానే కనిపిస్తోంది. కానీ, తెలుగులో మాత్రం బ్రహ్మోత్సవం సినిమా తర్వాత ఎటువంటి సినిమాకి సైన్ చేయలేదు ఈ ముద్దుగుమ్మ. తమిళంలో గరుడ అనే సినిమా, కవలాల్ వేందం అనే సినిమాలు తప్ప చేతిలో ఎటువంటి సినిమా లేదు.
డైరెక్టర్ తేజ పరిచయం చేసిన నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కాజల్ ఇప్పుడు మళ్లీ తేజ తెలుగులో తీయబోతున్న ఒక సినిమాలో నటించబోతుందని మాత్రమే చెబుతున్నారు. కానీ, దానికి సంబంధించిన న్యూస్ మాత్రం వినిపించడం లేదు. కాజల్ గతేడాది కూడ జూనియర్ ఎన్టీఆర్ సరసన టెంపర్ సినిమాలో మాత్రమే నటించింది.
ఈ సంవత్సరం టాప్ హీరోలతో చేసిన ఈ అమ్మడికి చేతిలో సినిమాలు ఎందుకు లేవు ? ఇక కాజల్ పని అయిపోయినట్లేనా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక అమ్మడికి ఆఖరి ఛాన్స్ అదీ కెరియర్ ని నిలబెట్టుకునే ఛాన్స్ ఎక్కడినుంచి వస్తుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
- మూర్తి
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more