ప్రిన్స్ మహేష్ బాబు లాంటి అందగాడి సరసన హీరోయిన్ గా నటించాలంటే బాలీవుడ్ నుంచి అంటే ముంబాయి నుంచి భామలు రావాల్సిందే. అందుకేనేమో ఫస్ట్ సినిమాలోనే కె రాఘవేంద్రరావు ప్రీతి జింతాని మహేష్ సరసకు తీసుకొచ్చాడు. ఇక అక్కడ్నుంచి అత్యధిక బాలీవుడ్ హీరోయిన్స్ తో చేసిన సూపర్ స్టార్ గా మహేష్ బాబు మారిపోయాడు.
ఇప్పుడు రీసెంట్ గా మురుగదాస్ సినిమాలో కూడ బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా నటించనుంది. ఈ నేపథ్యంలో అసలు మహేష్ బాబుకి బాలీవుడ్ హీరోయిన్స్ అంతగా కలిసిరారు అంటూ ఫిలిం నగర్ లో టాక్ మొదలైంది. కొంతమంది అయితే, హీరోయిన్ ఓన్లీ గ్లామర్ కే కదా ఉండేది ఎవరైతే ఏమైంది అని అంటున్నారు.
అసలు ఈ బాలీవుడ్ సెంటిమెంట్ మహేష్ సినిమాలకు ఎలా సెట్ అవుతుందో ఒక లుక్కేయండి.
ఫస్ట్ సినిమా రాజకుమారుడు ప్రీతిజింతాతో సోసో గా పాసయ్యాడు మహేష్. వీళ్లిద్దరి జోడి తెరపైన చాలా బాగుంది అని అప్పట్లో అందరూ అనుకున్నారు కూడ. ఇక రాఘవేంద్రరావుగారి సినిమా కాబట్టి పాస్ అయిపోయింది.
తర్వాత వంశీ సినిమాలో తనతో జతకట్టిన నమ్రతానే మహేష్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా అనుకున్నంత ఆడలేదు. ఆ తర్వాత సోనాలి బింద్రే తో జతకట్టిన మహేష్ మురారి సినిమాతో సూపర్ హిట్ ని అందుకున్నాడు. ఇక టక్కరి దొంగ సినిమాలో బాలీవుడ్ భామలైన బిపాసా, లిసారాయ్ లతో డిజాస్టర్ ని చవిచూసాడు. ఇక ఎన్నో అంచనాలతో వచ్చిన నాని సినిమా బాక్సాఫీసు ముందు బోల్తా పడింది. ఈ సినిమాలో మహేష్ సరసన బాలీవుడ్ అందాల భామ అమీషా పటేల్ నటించింది.
ఈ సినిమా తర్వాత బాలీవుడ్ భామలు వొద్దనుకున్నాడో లేదో కెరియర్ లో ఓ మోస్తరు విజయాలను, మంచి బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ అతిథి సినిమాలో అమృతారావ్ ని బాలీవుడ్ నుంచి రప్పించాడు. ఇక ఈ సినిమా యావరేజ్ టాక్ తో గట్టెక్కిన సంగతి తెలిసిందే.
చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ఇప్పుడు మురుగదాస్ తో నటిస్తున్న సినిమాలో బాలీవుడ్ భామ పరిణీతి చోప్రాతో జతకట్టనున్నాడు. మరి ఈ సినిమా మహేష్ కెరియర్ ని ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి.
- మూర్తి
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more