పూరీ జగన్నాథ్ తన సినిమాల్లో తన మీదే సెటైర్ వేసుకునే బాపతి. నేనింతే సినిమాలో బ్రహ్మీ క్యారెక్టర్ ను ఇడ్లీ విశ్వనాథ్ అంటూ దర్శకుల వ్యాపకాన్ని కామెడీ కోణంలో చూపే ప్రయత్నం చేశాడు. సినిమా వరకు ఆడకపోయినా ఆ కామెడీని మాత్రం ఇప్పటికీ గుర్తుంచుకుంటారు జనాలు. ఇక తాజాగా పూరీ చిరును ఉద్దేశించి కామెంట్లు చేశాడంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. 150వ సినిమాగా ఆటో జానీ ని చేజార్చుకున్న తర్వాత కోపంతోనే ఆ కామెంట్లు చేశాడంటూ కథనాలు వస్తున్నాయి.
లైఫ్ లో రిస్క్ చాలా అవసరం. కొత్త కథలు చేయటం రిస్క్ అనుకునే వాళ్లే రీమేక్ లకు వెళ్తారు అంటూ (చిరును ఉద్దేశించి అన్నాడో లేదో తెలీదు) సెటైర్ వేశాడని చెబుతున్నారు. ఇంకోవైపు మహేష్ లాంటి స్టార్ హీరో వేరే కమిట్ మెంట్ లతో బిజీ అయిపోవటంతో జనగణమన జెండా ఎత్తెసినట్లేనని హర్టయిన పూరీ మహేష్ సినిమా గురించి ఎక్కడా మాట్లాడకుండా సూపర్ స్టార్ అభిమానులకు అవమానపరుస్తున్నాడని చెప్పుకుంటున్నారు. మెగాస్టార్, సూపర్ స్టార్ మరి పవర్ స్టార్ పరిస్థితి ఏంటి?
కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా సమయంలో వచ్చిన పొరపచ్చాలతో పవన్ తో ఇక ఫ్యూచర్ లో జగన్ సినిమా తీయడని అంతా అనుకుంటున్న సమయంలో ఇద్దరమ్మాయిలతో లో ఓ డైలాగ్ పవన్ ను ఉద్దేశించి ఓ నెగటివ్ అర్థం వచ్చేలా డైలాగ్ పెట్టాడు. ఇక ఇప్పుడు ఇజంలో పూరీ చేసిన పని పవన్ కాదని ఎవరూ అనుకోలేరు.
ఇజం సినిమాలో పోసాని మినిస్టర్ పాత్ర పోషించాడు. కామెడీ టచ్ ఉన్న ఈ పాత్ర కనిపించినప్పుడల్లా వెనక అతని పార్టీ గుర్తు కనిపిస్తుంటుంది. అది పవన్ జనసేన గుర్తును పోలి ఉండటంతో ఈ రకంగా పూరీ తన ప్రతీకారం తీర్చుకున్నాడంటూ టాక్ వినిపిస్తోంది. మరి పూరీ చేసిన ఈ చిలిపి ప్రయత్నానికి ఫ్యాన్స్ ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more