సినిమా సెట్స్ మీద ఉండగానే రికార్డు మోతలు మోగించాలన్న ప్రయత్నం తర్వాత బెడిసి కొట్టడం ఈ మధ్య మనం చూస్తున్నాం. సినిమా హక్కుల విషయంలో అడ్డగోలు రేట్లు పెట్టి ఆపై కలెక్షన్లు రాక డిస్ట్రిబ్యూటర్లు బొక్కాబోర్లా పడటం తెలిసిందే. ఇది చాలదన్నట్లు బుల్లితెరపై కూడా వాటికి ఘోర పరాభవాలే మిగులుతున్నాయి.
స్టార్ హీరోలనే ఒకే ఒక్క కారణంతో వారి చిత్రాలను నిర్మాణ దశలో ఉండగానే పోటీ పడి కోట్లకు కోట్లు కుమ్మరించి కొనేస్తున్నాయి చానెళ్లు. తాజాగా బ్రహ్మోత్సవం విషయంలో జరిగిన ఉదంతమే దీనికి నిదర్శనం. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఈ చిత్రం భాక్స్ పీష్ వద్ద బోల్తా పడగా, ఈ మధ్యే టెలివిజన్ లో ప్రసారం చేయగా ఈ యేడాది అతి తక్కువ టీఆర్పీ(7.2) నమోదు చేసిన చిత్రంగా మరో రికార్డు క్రియేట్ చేసింది. ఈ చిత్రం కోసం సదరు ఛానెల్ వారు 11.20 కోట్లు చెల్లించడం విశేషం. ఇక మరో భారీ చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ విషయంలో కూడా మరో ఛానెల్ కి ఇలాంటి అనుభవమే ఎదురైంది.
ఇక ఇప్పుడు మహేష్ - మురగదాస్ చిత్రం చిత్రీకరణలో ఉండగానే రికార్డు ధరకి అమ్ముడు పోయిందన్న వార్త సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఓ ప్రముఖ ఛానెల్ నెట్ వర్క్ వాళ్లు సుమారు 26.5 కోట్లకు ఈ బైలింగువల్ హక్కులను సొంతం చేసుకున్నారంట. ఫస్ట్ లుక్ కూడా విడుదల కానీ ఈ సినిమాకు తెలుగు - తమిళ శాటిలైట్ రైట్స్ కోసం 21 కోట్లు కాగా మిగిలిన ఐదు కోట్ల రూపాయలూ హిందీ డబ్బింగ్ రైట్స్ కోసమని తెలుస్తోంది. ఆ లెక్కన దాదాపు కేవలం తెలుగు కోసమే పది కోట్ల పైగానే అన్న మాట. కేవలం క్రేజ్ మాత్రమేనమ్ముకుంటున్న ఆయా ఛానెళ్లు ఒకటి కాకపోతే మరోకటి అన్న చందాన ఇలా ఓవర్ బిజినెస్ తో చేతులు కాల్చుకుంటున్నాయని పలువురు సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more