ఒక సినిమా హిట్ అయ్యిందంటే ఆటోమేటిక్ మరో స్టార్ సినిమా ఆ అంచనాలు అందుకోవాలనే చూస్తాం. అవసరమైతే బడ్జెట్, బిజినెస్ విషయంలో వెనకడుగు వేయకుండా నిర్మాతలు కూడా తమ వంతు కృషి చేస్తుంటారు. అలాంటి సమయంలో ఒక్కోసారి పంట పండొచ్చు లేదా ఎండొచ్చు. బాహుబలి క్రియేట్ చేసిన రికార్డులను దరిదమిలా ఏ తెలుగు చిత్రం అందుకునే సీన్ లేకపోయినా పార్ట్ 2 మాత్రం ఖచ్ఛితంగా సంచలనాలు క్రియేట్ చేస్తుందని ఎవరైనా చెప్పగలరు. కానీ, బాహుబలికి దరిదాపులో కూడా అది లేకుంటే...
బాహుబలి ది కంక్లూజన్ సినిమా ఇంకా ఆరు నెలల టైం ఉంది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేశారు కూడా. కానీ, సీజీ వర్క్ విషయంలో ఆలస్యం జరిగితే మాత్రం అది మారే అవకాశం ఉంది. కానీ, బిజినెస్ మాత్రం ముందుగానే చేసేసుకుంటుంది. ఇప్పటికే నార్త్, తమిళ్ రైట్లను ఏ డబ్బింగ్ సినిమాకు కూడా అందనంత ఎత్తులో అమ్మేసుకున్న ఆర్కా మీడియా తెలుగు రాష్ట్రాల్లో అమ్మిన రేటు తెలిస్తే గుండె పట్టుకోవటం ఖాయం.
కేవలం ఈ రెండు రాష్ట్రాల్లో అమ్మిన రేటు అక్షరాల 137 కోట్లంట. నమ్మశక్యంగా అనిపించకపోయినా ఇది వాస్తవమనే అంటున్నాయి కొన్ని వర్గాలు. కేవలం తెలంగాణలోనే 50 కోట్లకు అమ్ముడు పోయిన ఈ చిత్రం, సీడెడ్ లో 27 కోట్లు, ఆంధ్రా, ఉత్తరాంధ్ర లో 60 కోట్లపైగానే అమ్ముడు పోయిందట. ముఖ్యంగా వైజాగ్ లో 13.27 కోట్లతో కొత్త రికార్డు క్రియేట్ చేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం. మొదటి పార్ట్ 30 కోట్లకు అమ్ముడు పోగా, చిరు 150 32 కోట్లకు అమ్ముడు పోయి కొత్త రికార్డు క్రియేట్ చేసిందని మొన్నే చెప్పుకున్నాం.
అయితే కాస్త అటు, ఇటుగా ఓ యాభై కోట్లకు అమ్ముడుపోతుందని ఎవరైనా అనుకుంటారు గానీ, మరి వంద కోట్ల దాటి బిజినెస్ చేస్తుందని కలలో కూడా ఎవరూ ఊహించి ఉండరు. మొదటి పార్ట్ కల్ఫవృక్షంగా లాభాలను తెచ్చిపెట్టడంతో విపరీత బుద్ధితోనే ఫస్ట్ పార్టీ ఇక ఎక్కువ రేటుకి అమ్మేసుకుందని చెబుతున్నారు. అంతేసి కలెక్షన్లను వసూలు చేసే మాట అటుంచి, ఒకవేళ ఆ వార్తే నిజమైతే మాత్రం బాహుబలి-2 కొట్టే సినిమా మళ్లీ రాజమౌళియే తీయాల్సి ఉంటుందేమో.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more