టాలీవుడ్ లో సరైన ఆఫర్లు లేక కోలీవుడ్ కి చెక్కేసిన ఓ అచ్చ తెలుగు అమ్మాయి ఇప్పడు అక్కడ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. వరుస హిట్లతో రెండు కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగింది. మరి ఆ రేంజ్ కి ఎధిగినప్పుడు బీఎండబ్ల్యూ లాంటి కాస్ట్ లీ కారు ఆమె సొంతం అవటం పెద్ద విశేషం ఏం కాదు కదా? ఆమె ఎవరో కాదు నటి శ్రీదివ్య.
రవిబాబు మనసారా చిత్రం ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన ఈ భామ బస్ స్టాప్ తో మంచి గుర్తింపు పొందింది. కాకపోతే తర్వాత ఆఫర్లే ఆమెను పలకరించలేదు. మల్లెల తీరంలో సిరిమల్లె చెట్టు, కేరింత లాంటి సినిమాలు ఆమె గ్రోత్ కి ఏ మాత్రం ఉపయోగపడలేదు. కానీ, అదే ఆమెకు కలిసొచ్చింది. వెంటనే కోలీవుడ్ లో బడా స్టార్లతో నటించే అవకాశం కొట్టేసింది. రీసెంట్ గా విశాల్ సరసన మరుదు(తెలుగులో రాయుడు) నటించి బిగ్ హిట్ అందుకుంది. ఇక ఇప్పుడు కార్తీ కాష్మోరాలో కూడా సందడి చేయబోతుంది. భారీ బడ్జెట్ సినిమా కదా అందుకే ప్రమోషన్ లో తాను పాల్గొంటోంది.
ఇక కార్యక్రమానికి కాస్ట్ లీ బీఎండబ్ల్యూ కారులో వచ్చిన శ్రీదివ్య చాలా విషయాలనే చెప్పుకొచ్చింది. క్షణం కూడా తీరిక లేకుండా సినిమాలతో గడిపేస్తుందట, అందుకే తెలుగమ్మాయి అయినప్పటికీ, కాష్మోరాకి ఓన్ డబ్బింగ్ చెప్పుకునేందుకు అస్సలు టైం దొరకలేదంట. ఈ అంశంపై విమర్శలు వస్తాయని ముందు జాగ్రత్తతోనే తాను ఈ స్టేట్ మెంట్ ఇచ్చానంటోంది. మొత్తానికి చుట్టపు చూపుగా వచ్చే హైదరాబాద్ లో తిరిగేందుకే ఈ రేంజ్ కారు వాడుతుంటే, ఏ రేంజ్ లో వెనకేసుకుంటుందో మీకు అర్థం కావట్లేదు!
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more