బాహుబలి ప్రాజెక్ట్ టాలీవుడ్ లో ప్రారంభించేటప్పుడు దానికి అసలు అంత క్రేజ్ వస్తుందని ఎవరూ ఊహించలేదు. భారీ బడ్జెట్ తో కేవలం సౌత్ లోనే రిలీజ్ చేయాలని ఆర్కా మీడియా చూసింది. అయితే అనుహ్యాంగా తెరపైకి వచ్చిన కరణ్ జోహార్ ఒక ప్రాంతీయ సినిమా హక్కులను కొనటం బాలీవుడ్ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఆపై దానిపై ప్రపంచ దృష్టి పడటం, మనకన్నా నార్త్ జనాలకే ఈ కంటెంట్ జనాలకు బాగా ఎక్కేయటం, ఓ రేంజ్ కి వెళ్లిపోవటం అంతా తెలిసిందే. పైగా కరణ్ లేకపోయి ఉంటే ఆ సినిమాను దేశవ్యాప్తంగా రిలీజ్ చేసి ఉండేవాళ్లం కాదని స్వయానా రాజమౌళి చెప్పటం విశేషం.
సుమారు 600 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా ద్వారా కరణ్ ధర్మ ప్రొడక్షన్ కూడా మూడు రెట్ల లాభాన్ని అందుకున్నాడు. రాజమౌళి చాలా గ్రేట్ డైరక్టర్ అని, మక్కీ చూశాకే అతని స్టామినా తెలిసి ముందుకు వచ్చానని చిత్ర ప్రమోషన్ల సందర్భంగా ప్రశంసలు కురిపించాడు కరణ్. అలాంటిది కంక్లూజన్ డేట్స్ అనౌన్స్ చేశాక కరణ్ సందడి ఎక్కడా కనిపించడం లేదు. అంతేందుకు మొన్న జరిగిన ఫస్ట్ లుక్ రిలీజ్ కి కూడా గైర్హాజరయ్యాడు. దీంతో జక్కన్నకి కరణ్ కి రైట్స్ విషయంలో తేడా కొట్టిందన్న వార్తలు గుప్పుమన్నాయి.
బాహుబలి 2 విషయంలో బిజినెస్ మరీ ఎక్కువగా జరిగిపోతుండటంతో అల్రెడీ అమ్మేసిన నార్త్ రైట్స్ ఒప్పందాన్ని మరోసారి మార్చుదామన్న ప్రపోజల్ తో కరణ్ హర్ట్ అయ్యాడని, నిర్మాతలు కూడా ఈ విషయంలో రాజమౌళిని సపోర్ట్ చేయటంతో వ్యవహారం శుభం కార్డు పడిందని చెప్పుకుంటున్నారు. ఇంకోవైపు సోనీ సంస్థ 51 కోట్లకు అల్రెడీ బాహుబలి-2 రైట్స్ కొనేసిందన్న వార్తలు కూడా జాతీయ మీడియాలో ప్రముఖంగా ప్రచురితం అవుతున్నాయి.
అయితే అలాంటిదేమీ లేదని సమాచారం అందుతోంది. యే దిల్ హై ముష్కిల్ వివాదంతో పెద్ద తలనొప్పి ఎదుర్కున్న కరణ్ అందుకే ఫస్ట్ లుక్ ఈవెంట్ కు హాజరుకాలేకపోయాడంట. అంతేకాదు యేదిల్.. ఫ్లాప్ అయితే బాహుబలి-2 రైట్స్ విషయంలో వెనకడుగు వేస్తాడు అన్న వార్తల్లో కూడా నిజం లేదని ధర్మ ప్రొడక్షన్ కార్యాలయం నుంచి ఓ వార్త అందుతోంది. సినిమా రిలీజ్ అయింది కాబట్టి ఊపిరి పీల్చుకుంటున్న కరణ్ త్వరలోనే బాహుబలి-2 ప్రమోషన్ లో పాల్గొనబోతున్నాడని సమాచారం. చూద్దాం... దీనిపై తొందరగానే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more