అక్కినేని వారుసుల పెళ్లి గురించి గత ఆరేడు నెలలుగా మీడియా బాగా కాంసంట్రేట్ చేసి, చివరకు నాగ్ స్వయంగా తెరిచి ఒప్పుకున్నంత వరకు వదిలిపెట్టలేదు. అదే సమయంలో అందాల అనుష్క మ్యారేజ్ గురించి కూడా బోలెడన్నీ పుకార్లు వచ్చాయి. ఓ బిజినెస్, ఓ నిర్మాత.. లవ్.. మ్యారేజ్ ఇలా వారానికో వార్త హల్ చల్ చేసింది.
అయితే తాను పెళ్లి విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్నానని ఒక్క ప్రకటన చేసేయటంతో అంతా సైలెంట్ అయిపోతారని అనుష్క భావించింది. కానీ, అలా జరగటం లేదు. తాజాగా మళ్లీ పెళ్లి అంటూ రెండు రోజులుగా చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈసారి అదనంగా మాంచి మసాలాను యాడ్ చేసి పడేశారు. అనుష్క పెళ్లిలో అక్కినేని ఫ్యామిలీ ఇన్ వాల్వ్ మెంట్ ఉండబోతుందన్నది దాని సారాంశం.
ఇప్పటికీ అన్నపూర్ణ స్టూడియోస్ కార్పొరేట్ నంబర్ నే వాడుతున్న అనుష్క పెళ్లి గురించి చర్చలు జరుపుతున్న సమయంలో కొన్ని లీకులు బయటికి వచ్చాయంట. దాని ప్రకారం బెంగళూరులో కుటుంబ సభ్యులు ఇంట్లో ఇప్పటికే చాలా పూజాకార్యక్రమాలు జరిపించారని, పెద్దలు కుదిర్చిన వరుడితోనే అనుష్క పెళ్లి చేసుకోబుతుందని, 2017లోనే ఇది జరగబోతుందని, దీనికి అక్కినేనివారి ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పేసుకుంటున్నారు.
కనీసం 36 ఏళ్ల జేజేమ్మ ఈ మధ్యే 11 ఏళ్ల టాలీవుడ్ కెరీర్ ను కొనసాగించింది. ప్రస్తుతం అనుష్క చేతిలో బాహుబలి-2 లాంటి బిగ్ ప్రాజెక్టుతోపాటు, సింగం-3, భాగమతి మాత్రమే ఉన్నాయి.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more