దేశంలో నకిలీ కరెన్సీ అధికమై ధరాఘాతానికి ప్రధాన కారణంగా మారుతుండటంతో పాటు తీవ్రవాద కార్యకాలాపాలకు, దేశ అంతర్గతంగా వున్న సంఘవిద్రోహ శక్తులు వాటిని వినియోగించుకుని దేశ భ్రదతకే ముప్పు తీసుకోస్తున్న తరుణంలో.. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకున్న సంచలనాత్మక నిర్ణయం సర్వత్రా హర్షదాయకమే. సుదీర్ఘకాలంలో భారత్ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఈ నిర్ణయం ఎంతైనా దోహదపడుతుందని చెప్పడంలో సందేహమే లేదు. దేశంలో నల్లధనం కట్టలు కట్టలుగా పేరుకుపోవడం.. నల్లధన కుబేరులు అసంఖ్యాకంగా పెరుగడంతో.. దీంతో ఈ వ్యవస్థను కట్టడి చేయడానికి ఎన్ని చర్యలు తీసుకున్నా.. అది, అంతు తెలయని సముద్రంలా మారడంతో ప్రభుత్వం విఫలమైంది.
ఈ నేపథ్యంలో నల్లధన కుబేరులతో పాటు సంఘ విద్రోహశక్తులను, తీవ్రవాదలకు కార్యకలాపాలను కట్టడి చేయవచ్చని కేంద్రం భావించింది. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం మీడియా సమావేశం ద్వారా అన్ని వివరాలను దేశ ప్రజలకు చెప్పిన ప్రధాని.. కొంత కాలం పాటు కష్టమైనా.. నష్టమైనా దేశ ప్రజలు దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం భరించాలని, సమగ్రాభివృద్ది ఫలాలు దేశ ప్రజలందరికీ అందాలంటే కఠోర నిర్ణయాలు తీసుకోక తప్పదనన్నారు.
అసలే వివాహాల సమయం.. బంగారు అభరణాలు, ఖరీదైన పట్టు చీరలు, ఏర్పాట్లు ఇలా అనేకం చేసుకోవాల్సిన తరుణంలో ప్రధాని సంచలన నిర్ణయంపై విమర్శలు వెల్లివిరుస్తున్నాయి. దీంతో పాటు ఈ నిర్ణయం తీసుకునే ముందు ప్రధాని అన్ని బ్యాంకులకు కొత్త సిరీస్ వున్న వంద రూపాయల నోట్లతో పాటు ఇంకా తక్కువ విలువైన నోట్లను అందుబాటులో వుంచివుండి నిర్ణయాన్ని ప్రకటించి వుంటే బాగుండేదని కూడా పలువరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలావుండగా, కేంద్ర ప్రభుత్వంలోని కీలక వ్యక్తులకు కూడా నోట్ల రద్దుపై తీసుకున్న నిర్ణయం తెలియదని అర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్, సహా కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ అశ్చక్యకరమైన వార్తలను చేశారు. కేవలం ఆర్బీఐలో అతికోద్ది మంది ముఖ్యులకు తప్ప ప్రభుత్వ పెద్దలకు కూడా ఈ నిర్ణయం గురించి ఏమీ తెలియదని, నోట్ల రద్దు నిర్ణయాన్ని పకడ్భంధీగా అమలు చేయాలనే ఈ నిర్ణయాన్ని అత్యంత గోప్యంగా వుంచామని చెప్పారు.
అనుమానాలకు తావిస్తున్న చంద్రబాబు వ్యాఖ్యలు..?
ఇంత వరకు బాగానే వున్నా... ప్రభుత్వంలో భాగస్వామ్యమైన పార్టీలకు, బీజేపి ముఖ్యలకు, పార్టీలో కీలక వ్యక్తులకు మద్దతుదారులకు మాత్రం ఈ నిర్ణయాన్ని ముందుగానే వెల్లడించినట్లు తెలుస్తుంది. పెద్ద నోట్లను రద్దు చేయాలని తాము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని, ఈ మేరకు అవసరమైతే శాసనసభ తీర్మాణం కూడా చేస్తామని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా వున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఇప్పటికే పలుమార్లు పత్రికాముఖంగా చెప్పడం.. అదే కేంద్రం కూడా అమలు చేయడంతో ఇక్కడ పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.
కేంద్రం తీసుకుంటున్న నిర్ణయం గురించి ముందస్తుగానే తెలుసుకున్న చంద్రబాబు.. ఈ వ్యాఖ్యలు చేశారా..? లేక చంద్రబాబుతో ఈ నిర్ణయంపై కేంద్రం చర్చించిందా..? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ విషయంలో అత్యంత గోప్యతను ప్రదర్శించామని, కేంద్ర ముఖ్యులకు కూడా సమాచారం అందించలేదని అర్థిక వ్యవహరాల కార్యదర్శి శక్తికాంద్ దాస్ చెప్పినా.. ఎన్డీఏలో కీలక వ్యక్తులకు ముందస్తు సమాచారం ఇచ్చేశారా..? అన్న అనుమాలకు తలెత్తుతున్నాయి.
బాబా రాందేవ్ వ్యాఖ్యలతో గోప్యత డోల్లతనం బట్టబయలు..
ఒక్క దెబ్బకు అనేక పక్షులు అన్నట్లుగా కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ దేశ ఆర్థిక వ్యవస్థపై సర్జికల్ స్ట్రైక్స్ చేసే సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడని కేంద్రం నిర్ణయాన్ని యోగా గురు బాబా రాందేవ్ స్వాగతించారు. అయితే మీడియా సమావేశంలో అయన నోటి నుంచి అనుకోని వచ్చాయో..లేక అనుకోకుండా వచ్చాయో తెలియదు కానీ కొన్ని వ్యాఖ్యలు జారాయి. దీంతో మోడీ ప్రభుత్వం తీసుకున్న పెద్ద కరెన్సీ నోట్ల రద్దు నిర్ణయం ముందుగానే అందరికీ తెలిసిందా..? అన్న అనుమానాలు కల్గుతున్నాయి.
పైన వీడియో లింకులోని సరిగ్గా 9 నిమిషాల 20 సెకన్ల నిడివి వద్దకు వెళ్లి అన్ చేయగానే బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలు సందేహాలకు తావిస్తున్నాయి. కేంద్రంలోని మోడీ ప్రభుత్వంలోని కేంద్ర విత్త మంత్రి అరుణ్ జైట్లీని కలిసేవాడినని, అ సమయంలో పలుమార్లు ప్రధాని నరేంద్రమోడీని కూడా కలిసానని, ఈ నేపథ్యంలో తమ మధ్య పలు విషయాలు చర్చకు వచ్చినట్లు ఆయన చెప్పారు. కేంద్రం 10 వేల రూపాయల నోటును కూడా ముద్రించాలని నిర్ణయించిందని, అయితే అందుకు తాను వ్యతికేతను చెప్పానన్నారు. పది వేల నోట్ల ముద్రణ విషయంలో తన నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకున్న కేంద్రం ఆ నోట్లను ముద్రించనందుకు ఆయన కేంద్రానికి, ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు.
బాబా రాందేవ్ ఎవరు..? ప్రభుత్వంలో ఆయన పాత్ర ఏమిటీ..?
యోగా గురు బాబా రాందేవ్ ప్రధానికి, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయానికి శుభాకాంక్షలు తెలపడాన్ని యావన్మంది స్వాగతిస్తారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యల వెనుక నిగూఢార్థం వేరే వుంది. కేంద్రమంత్రులతో, స్వయంగా ప్రధాన మంత్రిని తాను కలుసుకున్నే సందర్భంలో ఈ విషయాలు చర్చకు వచ్చాయని అనడంలో అంతరార్థం ఏమిటీ..? ప్రభుత్వం పది వేల రూపాయల కరెన్సీ నోటును కూడా తీసుకురావాలని భావించిందని, అయితే ఆ నిర్ణయాన్ని తాను వ్యతిరేకించానని కూడా చెప్పడం.. దానిని పరిగణలోకి తీసుకున్న కేంద్రం పది వేల రూపాయల నోటును ముద్రించలేదని అందుకు కూడా ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు బాబా రాందేవ్.
అయితే అత్యంగ గోప్యంగా జరగాల్సిన ఈ కార్యక్రమాలను ప్రభుత్వం.. బాబా రాందేవ్ తో ఎందుకు చర్చించిందన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. బాబా రాందేవ్ ప్రస్తుతం ఒక వ్యాపార వేత్త. ఆయనను మిగతా వ్యాపారవేత్తలతో సమానంగా పరిగణించకుండా.. కేంద్రం అయనతో నోట్ల రద్దు, ముద్రణ తదితర అత్యంత కీలక అంశాలను ఎందుకు చర్చించిందని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వంలో భాగస్వామి కాని వ్యక్తి.. ప్రభుత్వంలో ఏ కోశాన సంబంధం లేని వ్యక్తితో అత్యంత కీలకమైన విషయాలను చర్చించాల్సిన అవసరం ఏం వచ్చిందన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.
గత సార్వత్రిక ఎన్నికలలో బీజేపి గెలిచేందకు దోహదపడిన వ్యక్తితో బీజేపి ఈ రకంగా రుణం తీర్చుకుందా..? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే బాబా రాందేవ్ అటు కేంద్రంలోని మోదీ సర్కారు గెలుపుతో పాటు ఇటు హర్యానా తదిరత రాష్ట్రాల్లో గెలుపుకు కూడా కృష్టి చేశారు. ఇలా పార్టీ గెలుపుకు కృష్టి చేసిన ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ రహాస్యాలను ముందుగానే చర్చిస్తారా..? అలాగైత మోడీ ప్రభుత్వం కేంద్రంలోకి రావాలని అకాంక్షించిన దేశ ప్రజలందరికీ ఈ విషయాన్ని ముందుగానే ఎందుకు చెప్పలేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇక బాబా రాందేవ్ తరహాలో ఇంకా ఎందరితో కేంద్రం ఈ నిర్ణయంపై చర్చించిందన్న ప్ర్రశ్నలు వినబడుతున్నాయి.
ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందుగానే నిర్ణయం ఎందుకు..?
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం 500, 1000 రూపాయల కరెన్సీ నోట్లను రద్దు చేయాలని తీసుకున్న సంచలనాత్మక నిర్ణయంపై విమర్శలు కూడా అదే స్థాయిలో విమర్శలు కూడా వినబడుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేని బాబా రాందేవ్ తో అత్యంత గోప్యంగా జరగాల్సిన విషయాలను చర్చించారన్న వార్తలు వెలువడుతుండగా.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని చాకచక్యంగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణాలు వేరే వున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరో మూడు నాలుగు నెలల వ్యవధిలో రానున్న ఎన్నికలలో తమ పార్టీ ఓటమి తప్పదని ముందుగానే అంచనాకు వచ్చిన కేంద్రం ఇక ప్రత్యర్థులు కూడా ఎట్టి పరిస్థితుల్లో గెలవకూడదనే ఇలాంటి నిర్ణయం తీసకుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని రాజకీయ పరమైనదిగా విమర్శించారు. అయితే ఈ విషయం కూడా బాబా రాందేవ్ వ్యాఖ్యలతో మరింత స్పష్టత వచ్చినట్లు అయ్యింది.
పైన వీడియో లింకులోని 7 నిమిషాల 28 సెకన్ల నుంచి 9 నిమిషాల 20 సెకన్ల వరకు ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. రాజకీయాలలో డబ్బుతో ఓటు కొనడం కానీ, ప్రజాప్రతినిధులను కొనడం కానీ, లేదా ఓటర్లకు మద్యం పోయించడంపై కూడా ప్రభావం వుంటుందని చెప్పారు. అయితే రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలలో దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని కూడా తెలిపారు. ఇంతవరకు బాగానే వున్నా.. ఎన్నికల ప్రస్తావన గురించి చెప్పే సమయానికి ఆయన ముఖంలో ప్రత్యర్థులకు చెక్ పెట్టాం అన్న ఒక తేలికపాటి విజయగర్వపు నవ్వు కనిపించింది. దీంతో ఒక్క దెబ్బకు పలు పక్షులు అన్నట్లు బీజేపి దీనిని వినియోగించుకుంటుందన్న వార్తలు కూడా వినబడుతున్నాయి.
భారత రక్షణ దళాలు వీరోచితంగా దాయాధి గడ్డపైకి వెళ్లి.. పోరు సాగించి అక్కడున్న ఉగ్రవాద మూకల బేస్ క్యాంప్స్ పై దాడి చేయగా, దానిని ఆర్మీ ఘనతగా పరిగణించకుండా అనుమతి ఇవ్వడంతోనే మొత్తం జరిగిందని.. తన ఖాతాలోకి మైలేజ్ ను వేసకునేందుకు బీజేపి నాయకులు యత్నించారు. ఈ క్రమంలో ప్రధాని మోడీ మరో అడుగు ముందుకేసి దీపావళి రోజున జవాన్లకు దీపావళి శుబాకాంక్షలు తెలపాలని కూడా పిలుపునిచ్చారు. అయితే దానికి అంతగా స్పందన రాలేదనుకుందో ఏమో తెలియదు కానీ, కేంద్రం అకస్మాత్తుగా ఎకానమీపై సర్జికల్ స్ట్రైక్ చేసింది. మరి ఇదైనా బీజేపికి మైలేజ్ ఇస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే. వుంది.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more