నందమూరి వారసుడిగా బాలయ్య నుంచి మోక్షజ్న పగ్గాలు ఎప్పుడు అందుకుంటాడా? అన్న డిస్కషన్ శాతకర్ణి షూటింగ్ సమయం నుంచే ప్రారంభమైంది. ఇలా వందో చిత్రం మొదలైందో లేదో బాలయ్య ఆ డెబ్యూ ఎవరి చేతిలో పెట్టబోతున్నాడోనన్న చర్చకు తెరలేపారు. ఒకానోక దశలో శాతకర్ణితోనే మోక్షజ్న ఆరంగ్రేటం ఉంటుందని చెప్పుకున్నా రిలీజ్ తర్వాత ఉత్తదేనని తేలిపోయింది. వేరే ఫ్యామిలీస్ నుంచి వారసులు దూసుకొస్తుంటే.. బాలయ్య మాత్రం ఎందుకు ఆలసత్వం ప్రదర్శిస్తున్నాడంటూ ఒకానోక దశలో అభిమానులు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.
అయితే ఇంకా చదువుల్లోనే ఉన్నాడని, ఆ టైం వచ్చినప్పుడు మోక్షజ్న తప్పక సినిమాల్లోకి వస్తాడంటూ ఆ మధ్య బాలయ్య స్వయంగా చెప్పుకొచ్చి రూమర్లకు పుల్ స్టాప్ పెట్టేశాడు. ఇదిలా ఉంటే 22 ఏళ్ల ఈ నందమూరి వారసుడికి ఇప్పుడు తండ్రి ఓ బిగ్ టార్గెట్ విధించినట్లు తెలుస్తోంది. నటనలో, డాన్సుల్లో ఇప్పటికే రాటుదేలినప్పటికీ లుక్కు విషయంలోనే కాస్త తేడాకొడుతున్నాడంట. ప్రస్తుతం మోక్షజ్న బరువు కొంచెం ఎక్కువగానే ఉన్నాడు. హీరో కావాలంటే ఫిట్ గా మారాల్సిందేనని బాలయ్య చెప్పటంతో ఈ యేడాది చివరి కల్లా బరువు తగ్గి సిక్య్ పాక్ పెంచేయాలని సూచించాడంట. ప్రస్తుతం జిమ్ లో కసరత్తు చేసి పనిలో నిమగ్న మయ్యాడని తెలుస్తోంది.
సీనియర్ హీరోలందరూ బాడీ పై దృష్టిసారిస్తుంటే, బాలయ్యకు మాత్రం అలాంటి వాటికి చాలా దూరంగా ఉంటానంటూ ఓపెన్ గానే చెప్పేశాడు. ఇక కొడుకు విషయంలో మాత్రం అది కంపల్సరీ అని చెబుతుండటం విశేషం. అన్నీ కుదిరితే బాలయ్య డ్రీం ప్రాజెక్టు ఆదిత్య 369 సీక్వెల్ ఈ స్టార్ కిడ్ డెబ్యూ సినిమా అయ్యే అవకాశం ఉంది.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more