ఆరు నెలలుగా అదిగో ఇదిగో అంటూ అరకోర ఫోటోలతో ఊరిస్తున్నాడే తప్ప తన సినిమా విషయంలో ఎలాంటి అప్ డేట్ ఇవ్వకుండా మహేష్ కవ్విస్తున్నాడు. దసరా, దీపావళి, క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి, రిపబ్లిక్ డే ఇలా ఆయా తేదీల్లో తప్పక రిలీజ్ చేస్తామంటూ చెప్పి మాట తప్పారు మేకర్లు. ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్ కూడా మరింత ఆలస్యం అయ్యిందన్న వార్త అభిమానులకు అసంతృప్తిని కలగజేస్తోంది. అంతేకాదు అజిత్ లాంటి స్టార్ హీరోతో పోటీపడటం మొదటికే మోసం వస్తుందని హెచ్చరిస్తున్నారు కూడా.
ఇదిలా ఉంటే ఈ సినిమాకు టైటిల్ విషయంలో రకరకాల పేర్లు గతంలో వినిపించాయి. వాస్కోడిగామా, సంభవామీ, ఏజెంట్ శివ ఇలా రోజుకో టైటిల్ పై పుకార్లు వచ్చాయి. అయితే అన్నింట్లోకి సంభవామీ అనే ఓ పేరు మాత్రం హైలెట్ అవుతుంది. ఇందుకు కారణం నిర్మాతలు ఇదే టైటిల్ ను ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేయటం. హిందీలో సంభవామీ పేరుతో మురగదాస్ సినిమా రాబోతుందన్న ఒక వార్త లీక్ అయ్యింది.
దీనిపై ఆరాతీసిన మీడియాకు అది నిజమేనని తేలటంతో మహేష్ సినిమా కోసమేనంటూ వార్తలు వస్తున్నాయి. తెలుగు, తమిళ్ తోపాటు హిందీలో కూడా ఈ సినిమాను డబ్ చేసి వదలాలని చూస్తున్న సమయంలో ఈ పేరే కామన్ టైటిల్ కు బావుంటుదని ఫిక్సయ్యారంట. టైటిల్ విషయంలో ఇప్పటికిప్పుడే క్లారిటీ రాకపోయినప్పటికీ, రిలీజ్ కు కూడా సమయం ఉండటంతో మధ్యలో ఎప్పుడైనా దీనిపై ఓ అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more