మహేష్-మురగదాస్ సినిమా అనౌన్స్ అయ్యాక చాలా టైటిళ్ల పేర్లే వినిపించాయి. అయితే గాసిప్స్ అలా చక్కర్లు కొడుతున్నా పట్టించుకోకుండా షూటింగ్ ను కానిచ్చేసింది చిత్ర యూనిట్. వాస్కోడిగామా, అభిమన్యు, ఏజెంట్ శివ, సంభవామి, చివరకు మర్మం దగ్గర ఆగింది. ఇక ఇప్పుడు మరో కొత్త టైటిల్ తెర మీదకు వచ్చింది.
నిజానికి ఈ చిత్ర ప్రోడ్యూసర్ లో ఒకడైన ఠాగూర్ మధుకి ఆప్తుడు, మరో స్టార్ ప్రోడ్యూసర్ పీవీపీ విన్నర్ ప్రీ రిలీజ్ పంక్షన్ లో సంభవామి యుగే యుగే అంటూ హింట్ ఇవ్వటంతో ఆ టైటిలే అని అంతా అనుకున్నారు. దానికి తోడు హిందీలో కూడా మురగదాస్ అప్ కమింగ్ కు సంభవామి అనే టైటిల్ రిజిస్టర్ అయినట్లు వార్తలు వచ్చాయి. దాంతో అంతా మహేష్ సినిమానే అనుకున్నారు. తాజాగా వినిపిస్తున్న టైటిల్ ఏంటంటే.. ‘స్పై’డర్ అని...
ఇంతకు ముందు యూకేలో చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ యూకే లో ఓ టాప్ విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీకి అప్పజెప్పారన్న విషయం తెలిసిందే. దాదాపు 30 లక్షలతో దానిని రూపొందించబోతున్నారని చెప్పుకున్నాం కూడా. అందులో స్పైడర్ గురించి స్పెషల్ గా మెన్షన్ చేశారు కూడా. పైగా మహేష్ ఇందులో ఇంటలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. దీంతో సినిమాకు అదే టైటిల్ దాదాపు ఖరారైందనే అనుకుంటున్నారు. మరి ఈ విషయంలో సస్పెన్స్ వీడేది మాత్రం ఉగాదికే.. ఎందుకంటే ఆరోజే చిత్ర ఫస్ట్ లుక్ అని మహేషే స్వయంగా అనౌన్స్ చేశాడు కాబట్టి.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more