జాతీయ అవార్డుల విషయంలో పారదర్శకత అనేది ఎప్పుడూ కనిపించదు. ప్రజాదరణ పొందిన చిత్రాలు, లేదా ఫెర్ ఫార్మెన్స్ బేస్ డ్ చిత్రాలకు మాత్రమే వివిధ కేటగిరీల్లో అవార్డులు దక్కటం ఎప్పటి నుంచో జరుగుతూ వస్తోంది. అయితే ఇన్నాళ్ల అవార్డుల చరిత్రలో రీమేక్ చిత్రానికి అవార్డు కట్టబెట్టిన దాఖలాలు మాత్రంల లేవు. కానీ, ఫస్ట్ టైం ఓ సౌత్ రీమేక్ విషయంలో ఆ సాంప్రదాయంకు ఫుల్ స్టాప్ పడబోతుందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
మెగా స్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150ను 2016 నేషనల్ అవార్డుల కేటగిరీకి గానూ పంపినట్లు ఓ వార్త అందుతోంది. నిజానికి ఈ చిత్రం ఈ యేడాది జనవరిలోనే రిలీజ్ అయినప్పటికీ, గత ఏడాదే చివర్లోనే సెన్సార్ పూర్తి కావటంతో హడావుడిగా జ్యూరీకి పంపారంట. రైతుల సమస్య ప్రధాన ఇతివృత్తంగా సాగే ఈ చిత్రంతోనే చిరు పదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇవ్వటం, పైగా డ్యుయెల్ రోల్ లో నటించటం తెలిసిందే. సౌత్ తరపున సింగిల్ లాంగ్వేజ్(కేవలం తెలుగులోనే) లో రిలీజ్ అయ్యి వంద కోట్లు కొల్లగొట్టిన ఫస్ట్ మూవీగా ఖైదీ నంబర్ 150 కొత్త రికార్డు కూడా క్రియేట్ చేసింది.
అయితే విజయ్ హీరోగా మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ కత్తి కి ఇది రీమేక్ అన్న విషయం తెలిసిందే. అయితే కత్తి విషయంలోనే జరగని మ్యాజిక్ ఇప్పుడు ఖైదీ విషయంలో జరుగుతుందా? అన్నది కాస్త అనుమానమే. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న చిరు రాజకీయ కోణంలో కూడా గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడన్న టాక్ కూడా బయలుదేరింది. ఇందులో ఎంత నిజం అన్నది తెలియాలంటే చిత్ర నిర్మాతలు స్పందించాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more