ఐదు రోజుల క్రితం డైరక్టర్ వర్మ ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేయటం టాలీవుడ్ లో పెద్ద డిస్కషన్ కే దారితీసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా వస్తే రికార్డులు బద్ధలు అవ్వటం ఖాయం అని.. అవును... వన్ మెన్ షోగా సినిమాలను నిలబెట్టి కలెక్షన్లు రాబట్టే పవన్, సినిమా కోసం అహర్నిశలు కష్టపడి బ్లాక్ బస్టర్లు అందించే దర్శకధీరుడు ఈ ఇద్దరి కాంబో నిజంగానే బాక్సాపీస్ ను షేక్ చేస్తుందనటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. పంజా ఆడియో పంక్షన్ సమయంలో పవన్ తో సినిమా ఎప్పుడెప్పుడా అని తాను ఎదురుచూస్తున్నానని రాజమౌళి, నాకు ఒక సినిమా చేసి పెట్టమని నేను ఎప్పుడు ఏ డైరెక్టర్ ని చేయి చాచి అడగలేదు ఇప్పుడు రాజమౌళిని అడుగుతున్నాను అంటూ పవన్ చెప్పటం హైలెట్ అయ్యాయి.
కానీ, బాహుబలితోనే ఆరేళ్లు గడిపేసిన రాజమౌళి, తన సినిమాలతో పవన్ బిజీ అయిపోవటంతో ఆ టాపిక్ సైడ్ అయిపోయింది. ఇక ఇప్పుడు సినిమాల నుంచి ఫ్రీ కావటంతో నెక్స్ట్ ప్రాజెక్ట్ అదేనన్న వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. అవును.. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీని దృష్టిలో పెట్టుకుని ఫస్ట్ టైం ఓ పొలిటికల్ టచప్ ఉన్న సబ్జెక్ట్ తో రాజమౌళి సినిమా తీయబోతున్నాడంట. ఇందుకోసం కథ కూడా సిద్ధం చేసుకుంటున్నాడని టాక్ వినిపిస్తోంది. మాస్ పల్స్ కరెక్ట్ గా పట్టగలిగే రాజమౌళి అయితేనే అందుకు సరిగ్గా సరిపోతాడని భావించిన పవన్ అందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. పైగా ఇంకో గ్రాండ్ న్యూస్ ఏంటంటే... బాహుబలి-2 రిలీజ్ రోజునే ఈ చిత్ర ముహుర్తం కూడా లాంఛ్ చేయబోతున్నారంట.
కథకు తగ్గట్లే ‘చాణక్యుడు’ అన్న పవర్ ఫుల్ టైటిల్ ను ఇప్పటికే బాహుబలి నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్ట్రర్ చేయించినట్లు టాక్. బాహుబలి తర్వాత కూడా రెండు చిత్రాలు ఈ నిర్మాణ సంస్థలతోనే జక్కన్న కమిట్ అయిన విషయం తెలిసిందే కదా. అందుకే పవన్ తో ఈ భారీ పొలిటికల్ మూవీని తీసేందుకు ముందుకు వచ్చింది. మొత్తానికి టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబో సంచలనాలకు రెడీ అయిపోతుందన్న మాట. అయితే ఇప్పటిదాకా చెప్పుకున్నదంతా ఏప్రిల్ ఫూల్ కథనంగా చెబుతున్నందుకు క్షమించాలి. ఇప్పటికిది నిజం కాకపోయినప్పటికీ, భవిష్యత్తులో అది నిజం కాబోయే అవకాశంను కొట్టిపారేయలేం.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more