బాహుబలి దెబ్బకు నేషనల్ వైడ్ గా మోస్ట్ పాపులర్ స్టార్ అయిన ప్రభాస్ ఆ క్రేజ్ ను అలాగే నిలబెట్టుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. సుజిత్ తో తీయబోయే స్టైలిష్ ఎంటర్ టైనర్ కు భారీ బడ్జెట్ వెచ్చించటం, అందులో బాలీవుడ్ స్టార్లతో యాక్ట్ చేయించటం, పైగా మూడు భాషల్లో రిలీజ్ చేయించటం ఈ ప్రయత్నాలన్నీ అందుకు సంకేతమనే చెప్పాలి.
ఇదిలా ఉంటే బాహుబలి ది కంక్లూజన్ కి టైం దగ్గర పడుతుండటంతో బ్రాండ్ కంపెనీలు కూడా ప్రభాస్ కోసం ఎగబడుతున్నాయి. ఫస్ట్ పార్ట్ టైంలో ఒక్కటంటే ఒక్క యాడ్ లోనే మెరిసిన ఈ యంగ్ రెబల్ స్టార్ భారీ రెమ్యునరేషనే పుచ్చుకున్నట్లు తెలిసిందే. ఇక ఇప్పుడు బాహుబలి-2 పై హైప్ ఆకాశంలో ఉండటంతో బాహుబలి ప్రభాస్ క్రేజ్ ను వాడుకోవాలని కొన్ని కంపెనీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి.
అయితే వారికి డార్లింగ్ పెద్ద షాకే ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్క యాడ్ చేయాలంటే 10 కోట్లు డిమాండ్ చేస్తున్నాడంట. సాధారణంగా స్టార్ క్రికెటర్లయిన కోహ్లీ, ధోనీ లాంటివాళ్లు, పెద్ద పెద్ద సినిమా స్టార్లు నాలుగు నుంచి 5 కోట్లు, లేదంటే మరో ఒకటో, రెండో కోట్లు డిమాండ్ చేస్తుంటారు. కానీ, మరీ టూమచ్ గా అంత పెద్ద మొత్తం డిమాండ్ చేసే సరికి కొన్ని జడుసుకుని వెనకంజ వేస్తుండగా, మరికొన్ని అసలు సంప్రదించకుండానే సైలెంట్ గా ఉండిపోతున్నాయంట. అయినా యూత్ లో క్రేజ్, భీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్, లేడీ ఫ్యాన్స్ వీటన్నింటిలో కోహ్లీ కంటే ప్రభాస్ ఎందులో తక్కువని వీరాభిమానుల కామెంట్.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more