రాజకీయాలకు, సినిమాలకు అనుబంధం ఇప్పటిది కాదు. ఎన్నో ఏళ్లుగా నడుస్తూ వస్తోంది. కాస్త గుర్తింపు రాగానే వాళ్ల క్రేజ్ ను ఉపయోగించుకొని ఓట్లు దండుకోవాలని పొలిటికల్ పార్టీలు ప్రయత్నిస్తూ ఉంటాయి. బాహుబలి తో ప్రభాస్ కు వచ్చిన ఇమేజ్ ని క్యాష్ చేసుకోవాలని ఓ జాతీయ పార్టీ భావిస్తున్నట్టు ఇప్పుడు వార్తలు షికార్లు చేస్తున్నాయి. తద్వారా 2019 ఎన్నికల్లో లాభపడదామన్నది వారి ఆలోచనగా తెలుస్తోంది.
ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు 1990వ దశకంలో భారతీయ జనతా పార్టీలో చేరి 12,13 లోక్ సభలకు కాకినాడ, నరసాపురం నియోజకవర్గాల నుంచి ఎంపీగా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆపై 1999 నుంచి 2004 వరకూ వాజ్ పేయి మంత్రి వర్గంలో విదేశాంగ శాఖ సహాయమంత్రిగానూ సేవలందించారు. అనంతరం 2009లో హీరో చిరంజీవి ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి రాజమండ్రి నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన ఇటీవలి కాలంలో తిరిగి బీజేపీకి దగ్గరవుతూ వస్తున్నాడు.
ఆ మధ్య బాహుబలి పస్ట్ పార్ట్ హిట్ తర్వాత కృష్ణంరాజు ప్రభాస్ ను వెంట పెట్టుకుని మరీ వెళ్లి ప్రధాని మోదీని కలిసి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండో పార్ట్ తో ప్రభాస్ రేంజ్ మరింత పెరిగిపోయింది. ఈ దశలో ఎన్నికల్లో ప్రభాస్ తో ఎన్నికల ప్రచారం చేయిస్తే, గెలుపు ఖాయమవుతుందన్న ధీమాలో పార్టీ ఉందంట. ప్రభాస్ సినిమాల షూటింగులకు ఇబ్బంది కలిగించకుండా ప్రచార షెడ్యూల్ ను ఏర్పాటు చేసుకుంటామని హామీ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో పవన్ క్రేజ్ ను కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేసిన బీజేపీ, ప్రభాస్ ను మాత్రం నేషనల్ వైడ్ గా తిప్పేయాలని ఫిక్సయినట్లు సమాచారం.
అయితే, తనకు రాజకీయాలంటే అస్సలు ఇష్టం లేదని, వాటిని అస్సలు సరితూగనని స్వయంగా ప్రభాస్ ఆమధ్యే తేల్చి చెప్పాడు. ఆ లెక్కన ఈ వార్త ఉత్త గాలి వార్తేనని కొందరు అంటుంటే.. ఇప్పటికే కృష్ణంరాజుతో బీజేపీ గ్రౌండ్ వర్క్ ప్రారంభించేసిందని ఇంకొందరు అంటున్నారు. ఏది ఏమైనా మొహమాటస్తుడు, మాటల్లో కాస్త తడబడే డార్లింగ్ ను రాజకీయ కోణంలో వాడుకోవాలనుకోవటం వర్కువట్ అయ్యే పని కాదని పలువురు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more