మెగాఫ్యాన్స్ వెయిటింగ్ కి ఈ నెలాఖరులో పుల్ స్టాప్ పడబోుతంది. చిరు 151వ చిత్రం 'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి' సినిమాపైనే దృష్టి పెట్టారు. ఈ సినిమా విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వాళ్లంతా ఎంతో ఆత్రుత చూపుతున్నారు. గత కొంత కాలంగా మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ వార్త ఇప్పుడు బాలీవుడ్ లోనూ సెన్సేషన్ గా మారింది.
చారిత్రక నేపథ్యంలో రూపొందుతోన్న ఓ కీలక పాత్ర కోసం బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ను తీసుకుంటున్నట్లు ఆ మధ్య మన మీడియాలో కథనాలు వచ్చాయి. ఇప్పుడు ప్రముఖ బాలీవుడ్ మీడియా ఛానెళ్లు కూడా అదే వార్తను ప్రముఖంగా ప్రచురిస్తున్నారు. ఈ విషయంపై అమితాబ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్పుకుంటున్నప్పటికీ అధికారికంగా ఎక్కడా క్లారిటీ లేదు. మెగాస్టార్ స్వయంగా రిక్వెస్ట్ చేయడం .. చారిత్రక నేపథ్యంతో కూడిన కథ కావడం వలన, అమితాబ్ ఆసక్తిని చూపారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఆ మధ్య ఇదే క్యారెక్టర్ ను ఉపేంద్రకు ఇచ్చారన్న వార్త కూడా ఒకటి వినిపించింది. అలాగే హీరోయిన్ గా సోనాక్షి సిన్హాను కన్ఫర్మ్ చేసినట్లు చెప్పుకుంటున్నారు. ఇలా వినిపిస్తున్న వార్తలపై ఓ కంక్లూజన్ కావాలంటే మాత్రం కొన్నిరోజులు ఓపికపట్టాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more