బిగ్ బాస్ షో తెలుగులో బిగ్గెస్ట్ సక్సెస్ అయిన రియాల్టీ షోగా రికార్డులు సృష్టించింది. సల్మాన్ ఖాన్ ద్వారా హిందీలో ఎంత పాపులర్ అయ్యిందో తర్వాత కన్నడలో సుదీప్ తో కూడా అదే రేంజ్ లో హిట్టయ్యింది. అయితే కోలీవుడ్ లో మాత్రం కమల్ హాసన్ లాంటి సీనియర్ చేసిన వర్కవుట్ కాకపోవటంతో తెలుగుపై కాస్త డౌట్లు కలిగాయి.
కానీ, తెలుగులో మాత్రం బిగ్ బాస్ ఉహించని స్థాయిలో విజయవంతంగా టెలికాస్ట్ అయ్యింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా సూపర్బ్ అనిపించుకున్నాడు. షో డల్ అయినప్పుడల్లా శని ఆదివారాల్లో తారక్ వచ్చి తన మాటలతో మళ్లీ పైకి లేపేవాడు. దీంతో ఫైనల్ వరకు బుల్లి తెర ప్రేక్షకులు చాలా పెరిగిపోయారు. మొత్తానికి ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్ తో ముగింపు పలికిన బిగ్ బాస్ తర్వాత సీజన్ వచ్చే ఏడాదిలోనే ఉండబోతుందని స్పష్టమౌతోంది.
మరీ నెక్స్ట్ సీజన్ కి కూడా తారక్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తాడా? ఇది ఇప్పుడు అందరికి కలుగుతున్న డౌట్. వచ్చే ఏడాది కూడా ఇదే స్థాయిలో బిగ్ బాస్ ని నిర్వహించాలని ఫ్లాన్ వేస్తున్న స్టార్ మా నిర్వాహకులు ఫర్ ఏ ఛేంజ్ అఖిల్ ను తీసుకుంటాడనే వార్త చక్కర్లు కొట్టింది. అయితే ఇప్పుడు ఆ ఫ్లేస్ లో నాని వచ్చి చేరాడు. తన నేచురల్ ఫెర్ ఫార్మెన్స్ తో ఇంటిల్లిపాదికి దగ్గరై పోయాడు. అందుకే అతన్ని రిఫరెన్స్ చేస్తారని అంటున్నారు.
కానీ తారక్ ప్లేస్ వచ్చే హీరో ఎవరైనా ఆ షోని భర్తీ చేయటం కష్టమని భావిస్తున్న నిర్వాహకులు అతనితోనే కొనసాగించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఇవన్నీ రూమర్లుగానే భావించాలి.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more