తెలుగు చలనచిత్రసీమలో అగ్రహీరోలుగా కొనసాగుతున్న యువహీరోలందరి మద్య మంచి సన్నిహిత్యం వుందని ఇప్పటికే చాలా సందర్భాలలో విన్నాం. ఒకరి సినిమాలకు మరోకరు ప్రమోట్ చేయడంతో పాటు సినిమాలో వాయిస్ ఓవర్లు ఇత్యాదులకు కూడా సహకరించుకుంటారు. ఈ క్రమంలో ఇక నిర్మాతల అవతారం ఎత్తిన హీరోలు.. తమ స్నేహితులను కూడా తమ బ్యానర్ చిత్రాలలో నటించేందుకు కూడా రెడీ అవుతున్నారు.
ఈ ఒరవడికి అద్యులు ఎవరన్న విషయం తెలియదు కానీ.. హీరో నితిన్ తన స్నేహితుడు అఖిల్ తొలిచిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. రాజ్ తరుణ్ చిత్రాలకు మంచు బ్యానర్, ఇలా కొన్ని చిత్రాలు వచ్చి హిట్లుగా కూడా మారాయి. అయితే తాజాగా అగ్రహీరోలలో కూడా ఈ తరహా స్నేహపూర్వక వాతావరణం ఏర్పడటం తెలుగుచిత్రసీమకు శుభదాయకం అని అంటున్నారు విశ్లేషకులు. ఈ తరుణంలో మెగాపవన్ స్టార్ రాం చరణ్ తేజ్ ఓ వైపు హీరోగా, మరోవైపు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న విషయం తెలిపిందే.
కొణిదెల ప్రొడక్షన్స్ పేరుతో సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసుకున్న చెర్రీ.. తన బ్యానర్లో తొలి సినిమాగా తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీకి తలుపులు తెరిచారు. 'ఖైదీ నెంబర్ 150'తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ వసూళ్లను సాధించింది. దాంతో రెండవ సినిమాగా 200 కోట్లకి పైగా బడ్జెట్ తో చరణ్ 'సైరా' సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ బ్యానర్లో మూడవ సినిమా ఎన్టీఆర్ తో ఉంటుందనేది తాజా సమాచారం.
తన బ్యానర్లో బయట హీరోలతో కూడా సినిమాలు చేస్తానని చరణ్ ముందుగానే చెప్పాడు. అన్నట్టుగానే ఆయన ఎన్టీఆర్ తో ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. చరణ్ ఈ సినిమాకి నిర్మాతగా మాత్రమే వ్యవహరిస్తాడట. అంటే ఎన్టీఆర్ హీరోగా మాత్రమే ఈ సినిమా రూపొందనుంది. ఎన్టీఆర్ .. చరణ్ మంచి స్నేహితులు, అందువల్లనే తన బ్యానర్లో చేయమని చరణ్ అడగ్గానే ఎన్టీఆర్ ఓకే అనేశాడని చెప్పుకుంటున్నారు. త్వరలో ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం వుంది. ఇక ఈ ఇద్దరూ కలిసి రాజమౌళి మూవీ చేయనున్న సంగతి తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more