హీరోయిన్ తాప్సీకి తన గ్రాప్ కు ఇక బాలీవుడ్ లోనే బాగా పెంచుకుంటూ వెళ్తుంది. కొద్దికాలంలోనే బేబి, నామ్, షబానా, పింక్, జుడువా 2 వంటి చిత్రాలలో నటించి.. తనకంటూ బాలీవుడ్ ప్రేక్షకులలో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఓ వైపు సక్సెస్ ఫుల్ నటిగా రాణిస్తున్న ఈ నటి.. మరోవైపు ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ ను గెలుచుకున్న బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మాథ్యూస్ తో సాగిస్తున్న ప్రేమాయణం సినీవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల ముంబైలోని ఓ స్టార్ హోటల్ నుంచి వీరిద్దరూ చేయిచేయి కలుపుకుని బయటకు వచ్చారు. దీంతో, వీరి ప్రేమాయణంపై మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి. ఇప్పుడు వీరిద్దరూ నిశ్చితార్థం కూడా చేసుకున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. గోవాలో తాప్సీ కుటుంబసభ్యుల సమక్షంలో ఈ నిశ్చితార్థం నిరాడంబరంగా, సీక్రెట్ గా జరిగిందని చెబుతున్నారు. అయితే, ఈ వార్తలను తాప్సీ ఖండించింది. కుటుంబసభ్యులతో కలసి సరదాగా గోవా వెళ్లామని, నిశ్చితార్థంలాంటివి జరగలేదని ఆమె తెలిపింది.
ఇక తన బయోపిక్ ను నటి ప్రియాంక చోప్రా నటిస్తే బాగుంటుందని తన అభిప్రాయాన్ని చెప్పుకోచ్చిన మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్ కు ఇప్పుడు మరో ఆపర్ వచ్చింది. ప్రియాంక నుంచి ఇప్పటి వరకు ఈ విషయంలో ఎలాంటి బదులు రాకపోవడంతో.. మిధాలీకి తాప్సీ నుంచి ఆపర్ వచ్చింది. తాను మిథాలీ రాజ్ బయోపిక్ లో నటించే అవకాశం లభిస్తే ఎంతో సంతోషిస్తాననిన ముగ్దురాలిని అవుతానని చెప్పింది. మరీ దీనిపై మిథాలీ ఎప్పటికి స్పందిస్తారో వేచి చూద్దాం.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more