ప్రస్తుతకాలంలో వున్న నటీనటులందరూ నటనకు ఎంతవరకు ప్రాధాన్యం ఇస్తారో తెలియదు కానీ... ఇంకా సినిమారంగం రాకముందు రంగస్థల నాటకాల కాలంలో కేవలం నటనకోసమే తమ జీవితాన్ని అంకితం చేసిన ఎందరో కళాకారులు వున్నారు. ఏ పాత్ర అయినా సరే.. అందులో పూర్తిగా ఒదిగిపోయి, ప్రేక్షకులను ఆనందపరిచేవారు. అటువంటి వారిలో స్థానం నరసింహారావుగారు ఒకరు. ఈయన రంగస్థలం, తెలుగు చిత్రపరిశ్రమలో సుమారు 40ఏళ్లకు పైగా సత్యభామ, చిత్రాంగి మొదలైన స్త్రీ పాత్రలను ధరించి ప్రేక్షకాభిమానాన్ని పొందారు. ఇలా ఈ విధంగా అటు రంగంస్థలం, చిత్రపరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్రను వేసుకున్న ఈయన... పద్మశ్రీ పురస్కారాన్ని సాధించగలిగారు.
జీవిత విశేషాలు :
గుంటూరుజిల్లా బాపట్లలో నివాసం వున్న హనమంతరావు, అదెమ్మ దంపతులకు 1902 సెప్టెంబర్ర 23వ తేదీన స్థానం నరసింహారావు జన్మించారు. ఈయనకు చిన్నప్పటినుంచే నాటకాలలో నటించాలంటే ఎంతో ఇష్టముండేది. అందుకే పాఠశాలల్లో, గల్లీల్లో నిర్వహించే నాటకాల్లో పాలుపంచుకునేవారు. 1920లో బాపట్లలో ప్రదర్శించిన హరిశ్చంద్ర నాటకంలో ఆయనకు చంద్రమతి పాత్రధారి రాకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆయన.. ఆ కొరత తీర్చుకోవడానికి ఆ పాత్రను ధరించి తన నటన జీవితాన్ని ప్రారంభించారు. అలా ఆ విధంగా మొదలుపెట్టిన ఆయన... తదుపరి నాటకాల్లో పాలుపంచుకుంటూ వచ్చారు. తెనాలిలోని శ్రీరామవిలాస సభలో ప్రవేశించి.. ఆ కాలంలో వున్న గొప్ప నటులందరి సరసన పాత్రలు ధరించి.. దేశమంతా పర్యటించి అపారమైన అనుభవాన్ని సంపాదించారు.
అంతేకాదు.. ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 3వేల సార్లు రంగస్థలం మీద పౌరాణిక, చారిత్రక, సాంఘిక నాటకాలలో స్త్రీ పాత్రలను ధరించి ప్రజాభిమానాన్ని పొందారు. శృంగార రసాన్ని ప్రతిబింబించే రీతిలో సత్యభామ పాత్ర, ప్రణయానికి చిత్రాంగిగా, వీరరసాన్ని చిత్రించడంలో రోషనార, వలపుల చింతామణిగా, ప్రణయదేవతగా, భక్తురాలిగా, దేవదేవిగా, మధురాతి మధురమైన మధురవాణిగా నవరసాలు కలిగిన పాత్రలను ప్రతిభావంతంగా పోషించారు. రకరకాల చీరకట్టు సొగసులతో మనోహరంగా రంగస్థానం మీదకు ప్రవేశించి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశేవారు. అలా ఆ విధంగా రంగస్థలంలో తనదైన ముద్రవేసుకున్న ఈయన... రాధాకృష్ణ (1939), సత్యభామ (1942) వంటి సినిమాల్లో నటించారు. మొత్తంగా చెప్పుకోవాలంటే.. ఆయన కేవలం స్త్రీ పాత్రలను మాత్రమే ధరిస్తూ.. తన నటన జీవితాన్ని కొనసాగించారు. తన నటనాజీవితానికి సంబంధించిన ఆయన స్వయంగా ‘‘నటస్థానం’’ అనే గ్రంథాన్ని రచించారు.
పురస్కారాలు :
రంగస్థలంలో ఆయన చూపించిన సమయస్ఫూర్తిపై అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనకు సంబంధించిన ఒక పాఠాన్ని 10వ తరగతి తెలుగువాచకంలో ప్రచురించింది. ఈయన నటనకు ముగ్ధులైపోయిన రంగూన్ ప్రజలు 1938లో ఆయను బంగారు కిరీటాన్ని అందించారు. 1956లో భారతప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో ఆయనను సత్కరించింది. ఈ బహుమతిని పొందిన తొలి ఆంధ్రాకళాకారుడు ఈయనే! అస్వస్థత కారణంగా 1971 ఫిబ్రవరి 21వ తేదీన ఆయన తుదిశ్వాస విడిచారు.
(And get your daily news straight to your inbox)
Sep 23 | ఇంకా చలనచిత్ర పరిశ్రమ రాకముందే తెలుగునాటకరంగంలో ఎందరో గొప్ప నటులు తమతమ నటన ప్రతిభతో ప్రత్యేక ప్రస్థానాలను ఏర్పరుచుకున్నవారున్నారు. అందులో మన బళ్లారి రాఘవ ఒకరు. ఈయన న్యాయవాది పట్టా పొందినప్పటికీ నాటకాలలో ప్రత్యేక... Read more
Sep 20 | నాటకరంగం ద్వారా కళారంగంలోకి అడుగులు పెట్టిన అక్కినేని నాగేశ్వరరావు.. నటనలో తన ప్రతిభను నిరూపించుకుని తెలుగుసినిమా తొలినాళ్ల అగ్రనాయకులలో ఒకరుగా పేరు సంపాదించుకున్నారు. ధర్మపత్ని సినిమాతో సినీజీవితాన్ని ప్రారంభించిన ఈయన.. తెలుగు, తమిళ భాషల్లో... Read more
Jul 15 | తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్య ప్రధాన పాత్రలతో పాటు విలన్ క్యారెక్టర్లలో లీనమై, తన ప్రతిభతో అందరినీ మైమరిపించే సినిమా నటుడు ‘‘తనికెళ్ల భరణి’’! తెలుగు భాషాభిమాని అయిన ఈయన... ఎన్నో రచనలు రచించారు.... Read more