భాగ్యనగర నీటి వినియోగదారులకు మరింత ఉత్తమ సేవలు అందించేందుకు మెట్రోవాటర్‌బోర్డు అధికారులు ప్రయోగాలు చేపడుతున్నారు. ఇప్పటికే నేరుగా మీటర్ రీడర్ల ద్వారా బిల్లులను అందిస్తున్నారు. అలాగే ఇంటింటికి వెళ్లి ఇ-పాక్స్ మిషన్ల ద్వారా స్పాట్ బిల్లింగ్ వ్యవస్థను కూడా నిర్వహిస్తున్నారు. అయినా ఇప్పటికీ చాలామంది తమకు బిల్లులు సకాలంగా రావడం లేదన్న ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారులు మరింత సులభంగా నీటి బిల్లుల వివరాలను తెలుసుకునేందుకు ఉన్నతాధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. బిల్లుల వివరాలను ఇక నుంచి ఇంటర్నెట్, ఫేస్‌బుక్ ద్వారా కూడా తెలుసుకునే అవకాశాన్ని కలిస్తున్నట్టు మెట్రోవాటర్‌బోర్డు అధికారులు తెలిపారు.
ఇందుకోసం వినియోగదారులు ఈ-మెయిల్ ఐడీని వాటర్ బోర్డులోని మెట్రో కస్టమర్ సెంటర్ (ఎంసీసీ)లో నమోదు చేసుకోవాలంటున్నారు. లేదా 155313కి ఫోన్‌చేసి నమోదు చేసుకోవచ్చంటున్నారు. ఫేస్‌బుక్ ద్వారా కూడా బిల్లుల వివరాలను తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలను కూడా బోర్డులోని ఎంసీసీ విభాగంలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. నీటి బిల్లులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వాటర్‌బోర్డు తెలియజేసేందుకు విని యోగదారులు ఈ-మెయిల్ ఐడీతో పాటు, క్యాన్ నెంబర్ వివరాలు, గతనెల బిల్లుకు సంబంధించిన నెంబర్‌ను తెలియజేయాల్సి ఉంటుంది. ఇలా తెలిపిన తర్వాత వారి పూర్తి వివరాలను, నెల నెలా బిల్లులకు సంబంధించి సమాచారాన్ని సంబంధిత వినియోగదారుల వెబ్‌సైట్‌లో నమోదు చేస్తారు. ఆన్‌లైన్‌లో బిల్లులు చెల్లించేందుకు కూడా అధికారులు వెసులుబాటు కల్పిస్తున్నారు. ఫేస్‌బుక్‌లో సమాచారాన్ని తెలుసుకోవాలనుకునే వారు వాటర్ బోర్డుకు సంబంధించిన ఫేస్‌బుక్ www.facebook.com/hmwssb ద్వారా తెలుసుకునే వీలుంది.
...avnk
(And get your daily news straight to your inbox)
Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more
Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more
Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more
Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more
Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more