తెలుగు చిన్నితెరపై వెలిగే టాప్ యాంకర్లలో శిల్పాచక్రవర్తి ఒకరు. అందం విషయంలో మరింత టాప్ అనే పేరు కూడా తెచ్చుకున్నారు. అయితే పెళ్లి, పిల్లలు, సంసారం... ఈ క్రమంలో చాలా మంది మహిళల్లానే లావయ్యారు. వయసుకు మించినట్టు కనపడ్డారు. దాంతో కొన్ని కామెంట్లు కూడా ఎదుర్కున్నారు. ఇదంతా గతం.. ఇప్పుడు శిల్ప.. టీనేజీ బ్యూటీలా మారిపోయారు. స్లిమ్‌గా మెరిసిపోతున్నారు. ఏమిటి దీని వెనుక ఉన్న రహస్యం అంటే... తన ఫిట్‌నెస్ సీక్రెట్స్‌ని ఇలా పంచుకున్నారు. పెళ్లవకముందు నుంచీ కొద్దిగా బొద్దుగానే ఉండేదాన్ని. అయితే పెళ్లయి, పిల్లలు పుట్టాక మరింత లావయ్యాను. 70కిలోలకు పైగా బరువు ఉన్నాను. నా ఎత్తుకి ఉండాల్సిన దానికన్నా దాదాపు 20కిలోలు ఎక్కువన్నమాట. అందరూ లావయ్యావంటూంటే ఎలాగైనా తగ్గాలి అని ఓ ఏడాది క్రితం బంజారాహిల్స్‌లోని ఓ జిమ్‌లో చేరాను. పర్సనల్ ట్రైనర్‌ని ఏర్పాటు చేసుకున్నా. ప్రతి రోజూ వ్యాయామం. ఉదయం వేళలో గంటన్నర పాటు. అందులో కార్డియో ఎక్సర్‌సైజ్‌లకు అరగంట, కండిషనింగ్‌కు అరగంట.. ఇలా విభజించుకున్నా. దాదాపు అన్ని రకాల వర్కవుట్స్, ఎక్సర్‌సైజ్‌లు చేస్తా కాని, యోగా నాకు నప్పలేదు. బ్యాక్‌పెయిన్ వస్తుండడంతో దాన్ని దూరం పెట్టేశాను. దాని స్థానం లో డ్యాన్స్ క్లాసెస్‌కి వెళ్లడం మొదలుపెట్టాను. ఫ్లోర్ ఎక్సర్‌సైజ్‌లంటే నాకు ఇష్టం. దాని వల్ల వచ్చే ఫలితాలు దీర్ఘకాలం నిలిచి ఉంటాయి.
అందరూ డైటింగ్ చేయాలనేవారు బిర్యానీ, బర్గర్‌లు, పిజ్జాలు, ఇవన్నీ మనసును లాగేస్తుంటే ఆపుకోవడం కష్టమైంది. అయితే నేను మాత్రం నోరు కట్టుకోలేకపోయేదాన్ని. అపుడే మా ఫిట్‌నెస్ ట్రైనర్ ఓ ఉపాయం చెప్పింది. మీరు తినడం మానవద్దు మంచి ఫుడ్ బాగా తినండి. దాంతో నా డైట్ రైట్ మార్గం పట్టింది. పొద్దున్నే బాదంపప్పులతో ప్రారంభించి, 2 ఉడకబెట్టిన గుడ్లు (వైట్స్), బ్రౌన్‌బ్రెడ్+జామ్, ప్రొటీన్‌షేక్‌తో బ్రేక్‌ఫాస్ట్. మధ్యాహ్నం పుల్కా, సబ్జీ, పప్పు...పెరుగులతో లంచ్ ఫినిష్. ఇక సాయంత్రం 4గంటల ప్రాంతంలో మొలకెత్తిన గింజలు వంటి స్నాక్స్, రాత్రి పూట పుల్కా, సబ్జి, దాల్‌లు రిపీట్. టీ బాగా ఇష్టం. దాంతో రోజుకి రెండు మూడు సార్లు టీ తాగడం మానలేదు. ఫైబర్, ప్రొటీన్ బాగా ఉండే ఫుడ్ తీసుకోవడంతో.. ఆర్నెల్లలోనే మార్పు వచ్చింది. ఏడాదిలో పూర్తిగా షేప్ అప్ అయ్యాను. అంతేకాదు... ఇప్పుడు నాకు డైట్ విషయంలోనూ నియంత్రణ వచ్చింది. తినాలనిపిస్తే ఐస్‌క్రీమ్‌లూ, బిర్యానీలు లాగించేసినా, అవి ఫ్యాట్‌గా మారకుండా ఎలా జాగ్రత్తపడాలో, దాని కోసం ఎలాంటి వ్యాయామాలు చేయాలో కూడా తెలుసు.
‘శిల్ప’ సూత్రాలివి...
ఎంత సంపాదించినా ఫిట్‌గా లేకపోతే ఏం లాభం? ఆదాయం కన్నా ఆరోగ్యానికే నేనెప్పుడూ ప్రాధాన్యం ఇస్తాను.
నాకు సంబంధించినంత వరకూ అందం కన్నా కూడా ఆరోగ్యమే ముఖ్యం. నువ్వు అందంగా ఉన్నావు అని అనిపించుకోవడం కన్నా నువ్వు మంచి మనసున్న మనిషివి అనిపించుకోవడమే నాకిష్టం.
బరువు పెరగడం అనేది అనాకారితనానికి కారణమవుతుంది అని కాకుండా అనారోగ్యానికి దోహదం చేస్తుందనే ఉద్దేశ్యంతోనే నేను వ్యాయామం, ఆహారపు అలవాట్లలో మార్పు చేర్పులు చేసుకున్నా.
ఇష్టమైనవి తినడం తప్పుకాదు, అయితే తిన్నవి మన దేహం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయో, ఆ ప్రభావాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకుని ఉండడం అవసరం.
(And get your daily news straight to your inbox)
Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more
Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more
Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more
Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more
Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more