ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్ళి చేసుకుంటే చట్టానికి దొరక్కుండా తిరిగే నిత్య పెళ్ళి కొడుకులు ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు. అధిక భాగం వివాహాలకు చట్టబద్దత లేకపోవడం ఇలాంటి మోసాలు ఇటీవల బాగా పెరిగాయి. ఇలాంటి వాటి వల్ల అమాయక మహిళలు మోసపోతున్నారు. వారి కోసం రూపొందించిన చట్టమే ఆంధ్రప్రదేశ్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజెస్ యాక్ట 2002. వివాహాలను తప్పని సరిగా నమోదు చేయించాలన్నది చట్టం ఉద్దేశం. రాష్ట్రంలో జరిగే అన్ని కులాలు, మతాలకు చెందిన వివాహాలను తప్పని సరిగా రిజిస్టరు చేయించాలన్నది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పెళ్ళిళ్ళు ఏ సాంప్రదాయం ప్రకారం జరిగినప్పటికీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఈ చట్టం ప్రకారం రాష్ట్రంలో రిజిస్ట్రార్ ఆఫ్ మ్యారేజెస్ ఆఫీసర్లను రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. కొన్ని మతాల వారి వివాహాలు మత పెద్దల వద్ద నమోదవుతాయి. అలాంటి వివాహాలను చట్టం ప్రకారం రిజిస్టర్ చేయించవలసి ఉంటుంది. వివాహం జిరిగిన 30 రోజుల్లో మ్యారేజ్ ఆఫీసర్ కి తెలియజేయాలి. వధూవరులిద్దరూ దీని పై సంతకాల చేయాలి. వధువు తరుపున ఇద్దరు, వరుడి తరుపున ఇద్దరు సాక్షులు కూడా దాని పై దాని పై సంతకాలు చేయాల్సి ఉంటుంది. నిబంధన ప్రకారం, ఆ వివరాలను రిజిస్టర్ లో నమోదు చేస్తారు. ప్రక్రియ పూర్తయ్యాక వధూ వరులిద్దరికి వివాహా ధ్రువ పత్రం అంద జేస్తారు. దాందో ఆ వివాహానికి చట్టబద్దత వస్తుంది. పెళ్ళిళ్ళ అధికారికి శిక్ష : ఉద్దేశ్య పూర్వకంగా లేదా అశ్రద్ధతో వివాహాన్ని రిజిష్టర్ చేయించకుంటే వధూవరులిద్దరి తరుపున వారికి రూ. వెయ్యి రూపాయల వరకు జరిమానా అవకాశం ఉంటుంది. అయితే వివాహాం సందర్భంగా వధువు, వరుడికి సంబంధించిన వయస్సు, ఉద్యోగం, చదవు, సాక్షులతో బంధుత్వం తదితర వివరాలను రిజస్ట్రార్ కు అందజేయ వలసి ఉంటుంది. వివరాలను ఏదైనా తప్పుడు సమాచారం అందించడం నేరం. అలాంటి వారికి వెయ్య రూపాలయ జరిమానా విధించే అవకాశం ఉంది. వివాహాన్ని సరైన సమయంలో రిజిస్ట్రార్ చేయని ఆఫీసర్ కి మూడు నెలల జైలు శిక్ష లేదా రూ. 500 వరకు జరిమానా విధిస్తారు. |
(And get your daily news straight to your inbox)
Mar 16 | తన భర్తకు వారసత్వంగా సంక్రమించిన ఆస్తిని.. అతడి మరణం తరువాత తమ కుటుంబంలోని వ్యక్తులకు అందించవచ్చునని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వెల్లడించింది. కుటుంబం అంటే కేవలం భర్త తరపు వారు మాత్రమే కాదని..... Read more
Nov 30 | మీ త్లలిదండ్రుల ఇంట్లోంచి మిమ్మల్ని వెళ్లిపోమని అన్నారంటే అందుకు గల కారణాలను తెలిపాలి. మంచి పనులు చేస్తే వెళ్లిమన్నారా..? లేక దేని గురించి వెళ్లిపోమన్నారన్నది మీరు తెలియజేయలేదు. ఇక మంచి పనులతో ఇబ్బందులు వస్తాయని... Read more
Oct 03 | నేను ముస్లిం.. నాకు బాల్యవివాహాల చట్టం వర్తిస్తుందా..? అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ మద్రాసు కోర్టు తరువాత గుజరాత్ హైకోర్టు కూడా బాల్య వివాహ నిరోధక చట్టంపై స్పష్టమైన అదేశాలను జారీ చేసింది. ఈ... Read more
Jul 15 | నాకు డయాబిటిస్ వుంది..? నాకు వారసత్వంగా షుగర్ వ్యాధి సంక్రమించింది. అయితే నేను ప్రభుత్వ ఉద్యోగానికి పనికిరానా..? అన్న ప్రశ్న సాధరణంగా చాలా మందిలో తలెత్తుతుంది. అయితే తాజాగా మద్రాసు హైకోర్టు వెల్లడించిన తీర్పు... Read more
Jul 02 | నేను నా భర్తకు రెండో భార్యను, ఆయన మొదటి భార్య 2005లోనే కన్నమూసింది. ఆయన కూడా 2011లో మరణించారు. ఈ నేపథ్యంలో నాకు నా భర్త పించను లభిస్తుందా..? అన్న సందేహాలు చాలా మంది... Read more