హంపి
ప్రాచీన భారతదేశ వాస్తుకళకు సంబంధించిన కోటలు, దేవాలయాలు, విపణి కేంద్రాలు, నిఘా స్థూపాలు, గుర్రపుశాలలు, స్నానఘట్టాలు, ఏకరాతి శిల్పాలు లాంటివన్నీ పెద్ద పరిమాణంలోని బండరాళ్ల మధ్య చెల్లాచెదురుగా ఇక్కడి 14వ శతాబ్దం నాటి శిథిలాల్లో భద్రంగా దాగి వున్నాయి. ఇవన్నీ కలిసి ఈ ప్రదేశానికి పటిష్టమైన రూపాన్ని మరియు చారిత్రక భావాన్ని సొంతం చేస్తున్నాయి. అందుకే హంపి శిథిలాలు - యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా వర్థిల్లుతున్నాయి.