గోమటేశ్వర బాహుబలి విగ్రహం
కర్నాటక రాష్ట్రంలోని శ్రావణబెలగోల పట్టణానికి దగ్గర్లోని చంద్రగిరి కొండ నిర్మితమైన ఈ విగ్రహం... ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా విగ్రహంగానూ పేరు సాధించింది. దీనిని క్రీ.శ.983లో చాముండరాయ అనే వ్యక్తి నిర్మించాడు. తలపై భాగంనుంచి తొడలప్రాంతం వరకు ఎటువంటి ఆధారంలేకుండా వున్న ఈ విగ్రహం.. సుమారు 17.8 మీటర్ల ఎత్తులో వుంటుంది.