యమధర్మరాజు ఆస్థానంలో కూర్చొని మానవులు చేసే పాప, పుణ్య కర్మలను లెక్కించి, చిట్టాలు రాసే చిత్రగుప్తుడికి భూలోకంలో అక్కడక్కడా కొన్ని దేవాలయాలు వున్నాయి.
తెల్లవారుజాము లేచిన క్షణం నుంచి మనం నిత్యం నిర్వహించుకునే కార్యక్రమాలతో సహా.. రాత్రి నిద్రపోయే వేళ వరకు ఎన్నో పాపాలను చేస్తూ వుంటాం. కళ్లతో చెడు చూడటం, నోటితో చెడు మాట్లాడటం, చెవులతో చెడు వినడం వంటివి ప్రతిరోజూ చేస్తూనే వుంటాం.
అయితే చాలామంది వారు చేసే పాపాలను ఎవరూ లెక్కించరనే భ్రమలో పడిపోతారు. ఇదంతా అబద్ధం. మన ప్రాణాలను సృష్టించిన బ్రహ్మ మనలోనే ఇంకొక ప్రాణిని అమర్చాడు. ఆ ప్రాణి మనం చేసే ప్రతి చిన్న పాపానికి లెక్క కట్టి చిట్టాను తయారుచేస్తుంటుంది. పురాణాల ప్రకారం ఆ ప్రాణికి చిత్రగుప్త అని పేరు.
భరతుడు పాలించిన మన భారతదేశంలో చిత్రగుప్తుడిని కొలిచే భక్తులు చాలా ఎక్కువగా వున్నారు. రాముడుసైతం చిత్రగుప్తుడిని కొలిచాడని పురాణ, ఇతిహాసాలలో కథనాలు వున్నాయి. అందుకే రాముడు ఏలిన అయోధ్య రాజ్యంలో చిత్రగుప్తుడి దేవాలయం ఒకటుంది. స్వయంగా రాముడే ఇక్కడ పూజలు నిర్వహించేవాడని ప్రతీతి. దీనిని ధర్మహరి చిత్రగుప్త దేవాలయం అని పేరు కూడా వుంది. ఉత్తరప్రదేశ్ లో వున్న ఈ దేవాలయానికి భక్తుల తాకిడి చాలా ఎక్కువగానే వుంది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో చిత్రగుప్త దేవాలయాలు వున్నాయి. జబల్ పూర్ లోని పూటాతాల్, షిప్రానదీ తీరంలోని రామ్ ఘాట్ లో, ఉజ్జయినిలో రెండు దేవాలయాలు వున్నాయి. ఈ దేవాలయాలు దాదాపు రెండు దశాబ్దాల క్రితమే నిర్మించబడినవని అంచనా. ఒక్క మధ్య ప్రదేశ్‌లోనే నాలుగు చిత్ర గుప్త దేవాలయాలు ఉన్నాయి. రాజస్థాన్ అల్వార్‌లో మూడు శతాబ్దాల చిత్రగుప్త దేవాలయం ఉంది. అదే రాష్ట్రంలోని ఉదయపూర్‌లో మరో చిత్రగుప్త దేవాలయం ఉంది.
చిత్రగుప్తుని దేవాలయాలు దక్షిణ భారతదేశంలో కూడా వున్నాయి. తమిళనాడులోని కాంచీపురంలో ఒకటి... ఆంధ్రప్రదేశ్ లోని హైదరాబాద్ పాతబస్తీ కందికల్ గేట్ ప్రాంతంలో వుంది. అయినా చాలామంది స్థానికులకు హైదరాబాద్ లో చిత్రగుప్త దేవాలయం వున్నట్టు ఎవ్వరికీ తెలియదు.
దీపావళి పండుగయిన రెండోరోజు యమద్వితీయ వుంటుందని.. ఆరోజు చిత్రగుప్తుడిన పుట్టినరోజు నిర్వహించే ఆచారం పురాతనకాలం నుండి కొనసాగుతూ వస్తోంది. దీన్నే భాయ్ దూజ్ అని అంటారు. చిత్రగుప్తుడికి బుధవారం రోజు ఎంతో ఇష్టమైనదిగా పురోహితులు పేర్కొంటారు.
కేవలం అకాల మృత్యువును జయించడానికి మాత్రమే కాకుండా.. ఆరోగ్యం, చదువు, పెళ్లి, సంతానం వంటి అనేక కార్యకలాపాల్లో పరిష్కారం లభించడం కోసం చిత్రగుప్తుడి దేవాలయంలో పూజలు నిర్వహిస్తారని భక్తులు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
May 09 | స్థలపురాణం : పూర్వం త్రేతాయుగంలో భరద్వాజ మహర్షి శ్రీ మహావిష్ణువు కోసం ఘోర తపస్సు చేయాలని నిర్ణయించుకుని.. దక్షిణ హిందూ దేశానికి వెళతాడు. ఆ సందర్భంలో కృష్ణానదికి దగ్గరలో వున్న ఒక కొండ ప్రాంతానికి... Read more
Apr 18 | మహాభారతంలోని కథ : మాంధాత కుమారుడైన శిబి చక్రవర్తికి మేఘదాంబరుడు, జీమూత వాహనుడు అనే ఇద్దరు తమ్ముళ్లు వుండేవారు. వారిద్దరిలో మేఘదాంబరుడు.. తన అన్న అనుమతితో 1500 మందిని వెంటబెట్టుకుని కాష్మీరదేశం విడిచి తీర్థయాత్రలకు... Read more
Apr 08 | ఆలయ విశేషాలు : ఛాయ సోమేశ్వర ఆలయం నల్లగొండ పట్టణానికి నాలుగు కీలోమీటర్ల దూరంలో వున్న పానగల్లు అనే గ్రామంలో వుంది. క్రీ.శ. 12వ శతాబ్దంలో కుందూరు చోళులు దీనిని నిర్మించినట్టు ప్రస్తుతమున్న మ్యూజియం... Read more
Apr 03 | స్థలపురాణం : పూర్వం పరశురాముడు తన తండ్రి ఆజ్ఞమేరకు తల్లినే సంహరిస్తాడు. అయితే తీవ్ర బాధతో కుంగిపోతున్న పరశురాముడు.. తిరిగి తన తండ్రి ఇచ్చిన వరంతో తల్లిని బ్రతికించుకుంటాడు. కానీ.. తల్లిని చంపినందుకు తీవ్ర... Read more
Mar 28 | స్థలపురాణం : పూర్వం వజ్రనాభ అనే రాక్షసుడు నిత్యం ప్రజలను హింసిస్తూ.. వారికి అనేక కష్టాలను పెట్టేవాడు. ఇది చూసి తట్టుకోలేక బ్రహ్మ.. తన చేతిలో వున్న తామరపువ్వును ఆయుధంగా మార్చి ఆ రాక్షసుడని... Read more