స్థలపురాణం :
పూర్వం వజ్రనాభ అనే రాక్షసుడు నిత్యం ప్రజలను హింసిస్తూ.. వారికి అనేక కష్టాలను పెట్టేవాడు. ఇది చూసి తట్టుకోలేక బ్రహ్మ.. తన చేతిలో వున్న తామరపువ్వును ఆయుధంగా మార్చి ఆ రాక్షసుడని సంహరించాడు. ఆ సందర్భంలో... ఆ పువ్వు నుండి మూడు రేకులు భూమీ మీద మూడుచోట్ల పడి.. జ్యేష్ట పుష్కర్, మధ్య పుష్కర్, కనిష్ట పుష్కర్ సరస్సులుగా మారిపోయాయి.
ఆ ఆనందంలో బ్రహ్మకు అక్కడే యజ్ఞం చేయాలనే సంకల్పం ఏర్పడింది. అయితే తను చేసే యజ్ఞం రాక్షసుల కంటపడకుండా వుండడానికి ఆ సరస్సుల చుట్టూ.. దక్షిణా రత్నగిరి, ఉత్తరాన నీలగిరి, పశ్చిమాన సంచూరా, తూర్పున సూర్యగిరి అనే కొండలను సృష్టించి, దేవతలందర్నీ ఆహ్వానించాడు. కానీ బ్రహ్మభార్య అయిన సరస్వతీదేవి (సావిత్రిదేవి) అక్కడ వుండదు.
అప్పుడు బ్రహ్మ సరస్వతీదేవిని తీసుకుని రమ్మని నారదుడికి చెప్పి పంపిస్తాడు. నారదుడు సరస్వతీదేవి (సావిత్రిదేవి) దగ్గరకు వెళ్లి సందేశాన్ని అందిస్తాడు. ఆమెను ఒంటరిగా కాకుండా.. చెల్లికత్తెలతో కలిసి వెళ్లమని సలహా ఇస్తాడు. దాంతో ఆమె లక్ష్మీ, పార్వతులతో కలిసి వెళదామని నిశ్చయించుకుని, అక్కడే ఆగిపోతుంది.
సుముహూర్తం దగ్గర పడుతున్నా.. సావిత్రి దేవి ఇంకా రాకపోవడంతో బ్రహ్మ కంగారు పడుతుంటాడు. అనుకున్న సమయానికి యజ్ఞాన్ని ఎలాగైనా పూర్తి చేయాలని నిశ్చయించుకుంటాడు. అప్పుడు బ్రహ్మ ఇంద్రునికి ఏదో అమ్మాయిని చూసి తీసుకుని రమ్మని.. తనతో వివాహం చేసుకుని ఈ యగ్నాన్ని పూర్తి చేస్తానని చెబుతాడు.
ఇంద్రుడు బ్రహ్మ ఆజ్ఞను పాటించి.. గుజ్జర్ల కుటుంబానికి చెందిన ఒక పాలు అమ్ముకునే అమ్మాయిని తీసుకు వస్తాడు. బ్రహ్మ ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఆలోచనలో పడిపోతాడు. అక్కడే వున్న శివుడు, మహావిష్ణువులు బ్రహ్మకు పెళ్లి సలహా ఇస్తారు. అప్పటికప్పుడే ఆమెకు తలంటుస్నానం చేయించి, వస్త్రాభరణాలు ధరింపచేసి, గోవుతో శుభ్రం చేసి ఆమెకు ‘గాయత్రి’ అనే పేరు పెడతాడు. ఆమెను వివాహం చేసుకుని, సుముహూర్తం దాకటముందే గాయత్రితో కలిసి యజ్ఞాన్ని పూర్తి చేస్తాడు.
అయితే అదే సమయంలో అక్కడికి సరస్వతీదేవి.. లక్ష్మీపార్వతులతో కలిసి వస్తుంది. అక్కడ జరుగుతున్న విషయాలను చూసి తనలో వున్న కోపాన్ని తట్టుకోలేక... బ్రహ్మాది దేవతలందర్ని శపించేస్తుంది. తన భర్తే అయిన బ్రహ్మను త్వరగా వృద్ధుడై పోవాలని, ఒక్క పుష్కర్ లో వేరెక్కడా బ్రహ్మ ఆలయాలు వుండకూడదని ఘోర శాపం ఇస్తుంది.
అలాగే ఇంద్రుడుకి కూడా.. అన్ని యుద్ధాలలో అపజయం తప్పదని శపిస్తుంది. మానవుని జన్మ ఎత్తి భార్యావియోగంతో బాధపడమని విష్ణువును శపించింది. శ్మశానంలో భూతప్రేతపిశాచాలతో సంచరించమని శివుడిని, భిక్షాటనలో జీవించమని బ్రాహ్మణులను శపిస్తుంది. ఎంతో ధనవంతుడైన కుబేరుడిని కూడా.. తన డబ్బంతా పోగొట్టుకుని నిరుపేదగా జీవించమని శపిస్తుంది.
ఇలా ఈ విధంగా అందరిని శపించిన తర్వాత తన కోపాన్ని చల్లార్చుకోవడం కోసం అక్కడే వున్న రత్నగిరి పర్వతాలకు వెళ్లి తపస్సు చేయడానికి వెళుతుంది. అలా తపస్సు చేస్తూ ఆమె సరస్వతీ నదిగా మారి ప్రవహిస్తుందని పురాణంలో కథనం.
సావిత్రిదేవి శపించి వెళ్లిపోయిన తర్వాత.. బ్రాహ్మణులను యజ్ఞం కొనసాగించమని బ్రహ్మ కోరుకుంటాడు. అయితే వారికి సరస్వతీదేవి ఇచ్చిన శాపం నుండి విముక్తి కలిగింమని వారు బ్రహ్మను వేడుకుంటారు.
అప్పుడు బ్రహ్మ.. ‘‘ఈ యజ్ఞం చేయడం వల్ల అప్పటికే పలితం దక్కిందని.. దాంతో గాయత్రి పుష్కర్ తీర్థక్షేత్రమై విలసిల్లుతుందని చెబుతాడు. అలాగే ఇంద్రుడు కూడా తిరిగి స్వర్గాన్ని పొందుతాడని, విష్ణువు శ్రీరాముడిగా జన్మించి, రాక్షస సంహారం చేస్తాడని, బ్రహ్మాణులు గురు గౌరవాన్ని పొందుతారని’’ చెబుతాడు. ఆ తర్వాత అందరు కలిసి యజ్ఞాన్ని ముగించుకుంటారు.
ఆలయ విశేషాలు :
రాజస్థాన్ లో వున్న అజ్మీర్ ప్రాంతానికి వాయువ్య భాగంలో పుష్కర్ దగ్గర గాయత్రిగిరిలో ఒక శక్తి పీఠం వుంది. దీనినే బ్రహ్మ పుష్కరిణి అంటారు. ఈ పీఠం సముద్ర మట్టానికి 1580 అడుగుల ఎత్తులోవుంది. ఇక్కడే వున్న పుష్కర్ సరస్సు.. నిత్యం హోమాలతో, పూజలతో కళకళలాడుతుంది. ఈ సరస్సు ఒడ్డునే బ్రహ్మ ఆలయం వుంది. యావత్ ప్రపంచంలో బ్రహ్మ ఆలయం ఇదొక్కటే వుంది. మన దేశంలో ఎంతోముఖ్య తీర్థరాజ్యంగా ఇది ప్రసిద్ధి చెందింది.
చరిత్ర :
పూర్వం ఆది శంకరాచార్యులవారు ఈ ప్రదేశానికి వచ్చి ఒకసారి ఆలయాన్ని పునరుద్ధరించారని చెబుతుంటారు. ఆ తర్వాత మధ్యయుగంలో జవాత్ రాజా దీనిని మరోసారి పునరుద్ధరణ చేశారని కథనం. అయితే ఈ ఆలయంలో గొప్ప విషయం ఏమిటంటే.. లోపల వందలకొద్దీ వెండినాణేలు గొడలకు అంటించి వుండటం.
(And get your daily news straight to your inbox)
May 09 | స్థలపురాణం : పూర్వం త్రేతాయుగంలో భరద్వాజ మహర్షి శ్రీ మహావిష్ణువు కోసం ఘోర తపస్సు చేయాలని నిర్ణయించుకుని.. దక్షిణ హిందూ దేశానికి వెళతాడు. ఆ సందర్భంలో కృష్ణానదికి దగ్గరలో వున్న ఒక కొండ ప్రాంతానికి... Read more
Apr 18 | మహాభారతంలోని కథ : మాంధాత కుమారుడైన శిబి చక్రవర్తికి మేఘదాంబరుడు, జీమూత వాహనుడు అనే ఇద్దరు తమ్ముళ్లు వుండేవారు. వారిద్దరిలో మేఘదాంబరుడు.. తన అన్న అనుమతితో 1500 మందిని వెంటబెట్టుకుని కాష్మీరదేశం విడిచి తీర్థయాత్రలకు... Read more
Apr 08 | ఆలయ విశేషాలు : ఛాయ సోమేశ్వర ఆలయం నల్లగొండ పట్టణానికి నాలుగు కీలోమీటర్ల దూరంలో వున్న పానగల్లు అనే గ్రామంలో వుంది. క్రీ.శ. 12వ శతాబ్దంలో కుందూరు చోళులు దీనిని నిర్మించినట్టు ప్రస్తుతమున్న మ్యూజియం... Read more
Apr 03 | స్థలపురాణం : పూర్వం పరశురాముడు తన తండ్రి ఆజ్ఞమేరకు తల్లినే సంహరిస్తాడు. అయితే తీవ్ర బాధతో కుంగిపోతున్న పరశురాముడు.. తిరిగి తన తండ్రి ఇచ్చిన వరంతో తల్లిని బ్రతికించుకుంటాడు. కానీ.. తల్లిని చంపినందుకు తీవ్ర... Read more
Mar 20 | యమధర్మరాజు ఆస్థానంలో కూర్చొని మానవులు చేసే పాప, పుణ్య కర్మలను లెక్కించి, చిట్టాలు రాసే చిత్రగుప్తుడికి భూలోకంలో అక్కడక్కడా కొన్ని దేవాలయాలు వున్నాయి. తెల్లవారుజాము లేచిన క్షణం నుంచి మనం నిత్యం నిర్వహించుకునే కార్యక్రమాలతో... Read more