గుడికి వెళ్లినప్పుడు దర్శనం అయ్యాక పూజారి నెత్తి మీద శడగోప్యం పెట్టి పంపిస్తాడు. మరి శడగోప్యం పెట్టడం వలన కలిగే ఫలితం ఏమిటి ? ఎందుకు శడగోప్యం పెట్టించుకోవాలి. శడగోప్యం అంటే అత్యంత గోప్యామైనది అని అర్థం. శఠగోపంను వెండి , రాగి, కంచుతో తయారు చేస్తారు. దాని మీద విష్ణువు పాదాలుంటాయి. అంటే మనము కోరికలను భగవంతుడికి ఇక్కడే తెలపాలన్నమాట. దేవాలయంలో దర్శనం అయ్యాక తీర్థం, శఠగోపనం తప్పక తీసుకోవాలి. చాలా మంది దేవుడ్ని దర్శనం చేసుకున్నాక వచ్చినన పనైపోయింది చక, చకా వెళ్ళి ఏదో ఏకాంత నిర్మల ప్రదేశం చూసుకొని కూర్చుంటారు.
కొద్ది మంది మాత్రమే ఆగి, శఠగోపనం పెట్టించుకుంటారు. మానవునికి శత్రువులైన కామమూ, క్రోధమూ, లోభమూ, మోహమూ, మదమూ, మాత్సర్యముల వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తలుస్తూ తలవంచి తీసుకోవటము మరో అర్థం. శఠగోపనం తల మీద ఉంచినప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్, దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినప్పుడు విద్యుదావేశం జరిగి, మనలోని అధిక విద్యుత్ బైటికెళుతుంది. తద్వారా శరీరంలో ఆందోళనా, ఆవేశమూ తగ్గుతాయి. కాబట్టి దేవాలయాలకు వెళ్ళినప్పుడు తప్పకుండా శడగోప్యం పెట్టించుకోండి. సకల ప్రాప్తిని పొందండి.
Knr
(And get your daily news straight to your inbox)
Apr 21 | శుభకార్యాలకు వెళుతుంటే పిల్లి అడ్డం వస్తే పెద్దలు చేసే హడావిడి అంతా ఇంతాకాదు. విసుక్కోవడం సంగతి పక్న బెడితే అసలు కాలు ముందుకు కదపకుండా వెనక్కి తిరుగుతారు. నిజంగా.. పిల్లి మొహం చూస్తే పంచ... Read more
Jan 11 | పెళ్ళి మొదలుకుని ఎటువంటి పూజాది క్రతువులు అయినా, పట్టు వస్త్ర ధారణ, ఆడవారికీ - మగవారికీ కూడా సూచించింది హిందూ సాంప్రదాయం. ఆడవారికీ పట్టు వస్త్రాలకీ అవినాభావ సంబంధం ఉంది. రక రకాల రంగుల్లో,... Read more
Jan 09 | మౌనము అంటే, ముని వ్రుత్తి... మునులు ఆచరించే విధానం అని అర్ధం. మనకు పంచ జ్ఞ్యానేన్ద్రియాలు ఉన్నాయి. శరీరం, కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు. వీటన్నిటికీ మౌనాన్ని ఇవ్వడమే మౌన వ్రతాన్ని ఆచరించడం. శరీరాన్ని... Read more
Jan 07 | బల్లి ... ఈ పేరు వినగానే, ఈ పేరుకి అధిపతి అయిన జీవిని చూడగానే, మనకే తెలియని ఛీదరింపు, మనల్ని ఆవహిస్తుంది... ఇళ్ళల్లో గూడలకి అతుక్కుని ఉండే బల్లి పొరపాటున మనమీద, లేక వంటకాల... Read more
Jan 06 | సీతా దేవి, మారు వేషంలో ఉన్న రావణాసురుడికి భిక్ష వేసేందుకు లక్ష్మణ రేఖ దాటే ముందు, ఆమె కుడి కన్ను అడిరిందట... ఒకానొక మహా కవి, తన రామాయణంలో ఈ అంశాన్ని పొందుపరిచారు...కళ్ళు అదరడం,... Read more