మన హిందువులకు ఉన్నంతమంది దేవుళ్ళు మరేమతం వారికి లేరు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, గణపతి, సరస్వతి, లక్ష్మి, పార్వతి, శ్రీరాముడు, సీతాదేవి, హనుమంతుడు - ఇలా ఎందరో దేవుళ్ళు వున్నారు. సూర్యుడు, చంద్రుడు, భూమి, అగ్ని, వాయుదేవుడు, వరుణదేవుడు - ఇలా సృష్టి, స్థితి, లయలలో మనకు మేలు చేస్తున్న శక్తులు అన్నిటినీ అర్చిస్తున్నాం. అంతెందుకు.. ఇల్లు ఊడ్చే చీపురుకట్టను కూడా పరమ పవిత్రంగా భావిస్తాం. చీపురుకట్టను తొక్కితే పాపం వస్తుంది అని చెంపలు వేసుకోవడం మీరు గమనించే వుంటారు. ఈ ఆచారం ఈనాటిది కాదు.. వేదాల్లోనే వుంది. ఈ లెక్కన మనకు వందమందో, వెయ్యిమందో కాదు, ఏకంగా ముక్కోటి దేవతలున్నారు. ఇంతమంది దేవుళ్ళలో ఎవర్ని పూజించాలి, ఏ విధంగా పూజించాలి అంటే, ఎవరికి వాళ్లు తమకు నచ్చిన రూపాన్ని, నచ్చిన రీతిలో పూజిస్తారు. ఇంతకీ అసలు దేవుళ్ళకు రూపాలు వున్నాయా? తలమీద కొప్పు, మెడలో సర్పం వుంటేనే శివుడా? విల్లు, బాణం ధరిస్తేనే రాముడా? - లాంటి తరహాలో కొందరు ప్రశ్నలు సంధిస్తారు.
అసలు దేవుడు వున్నాడా? వుంటే చూపించమని తర్కించేవాళ్లు కూడా వున్నారు. ఇలాంటి వాదాలకు సమాధానం చెప్పడం కుదరదు. మనం ఆలోచిస్తాం. ఊహలు చేస్తాం. కలలు కంటాం. వాటన్నిటికీ ఆధారాలు చూపమంటే కుదురుతుందా? మనసులో వుండే ఆనందం లేదా ఆందోళన గురించి మాటల్లో చెప్పగలం కానీ పట్టి చూపమంటే వీలవుతుందా? కనుక దేవుడూ అంతే. ఉన్నాడని నమ్మినవాళ్ళకి నిదర్శనాలు కనిపిస్తాయి. నమ్మకం లేనివారిని బలవంతంగా ఒప్పించాల్సిన పనిలేదు. సరే, దేవుణ్ణి నమ్మేవాళ్లలో కూడా రెండు రకాలు వున్నారు. దేవుడు నిరాకారుడు, నిర్గుణుడు, ఆయనకు రూపం ఇవ్వడమేంటి అనేవారు కొందరు. దేవుడికి ఆకారమిచ్చి, పూజలు చేసేవారు కొందరు. ఈ అనంత విశ్వంలో అణువణువునా వున్న భగవంతునికి రూపం ఎందుకు అంటే, అది స్థిరత్వం కోసం. మనసును నిమగ్నం చేయడం కోసం. కొందరికి గణపతి ఆరాధ్యదైవం అయితే, మరికొందరికి హనుమంతుడు ఇష్టదైవం. ఎవరి నమ్మకం వారిది. ఎవరి పద్ధతి వారిది. ఏ ఆకృతీ లేకుండా, సృష్టిని నడిపిస్తున్న ఒక అతీత శక్తి వుందని నమ్మి ప్రార్థించేవారు చాలా తక్కువ. మనసులో ఏదో ఒక రూపాన్ని ప్రతిష్టించుకుని ఆరాధించేవారే అధికశాతం. రాముడు, కృష్ణుడు, దుర్గాదేవి, లక్ష్మీదేవి, - ఈ దేవుళ్ల రూపాలు మన పూజామందిరంలోనే కాదు, గుండె, గుడిసెలోనూ ప్రతిష్టించుకున్నాం. ఆ రూపాన్ని అర్చిస్తున్నప్పుడు మనసు అక్కడ నిమగ్నమౌతుంది. ఆ కాసేపూ ఇతర ఆలోచనలు లేకుండా దేవునిమీద కేంద్రీకృతం అవుతుంది. అందుకే దేవుని సాకారంగా పూజిస్తాం.
(And get your daily news straight to your inbox)
Apr 21 | శుభకార్యాలకు వెళుతుంటే పిల్లి అడ్డం వస్తే పెద్దలు చేసే హడావిడి అంతా ఇంతాకాదు. విసుక్కోవడం సంగతి పక్న బెడితే అసలు కాలు ముందుకు కదపకుండా వెనక్కి తిరుగుతారు. నిజంగా.. పిల్లి మొహం చూస్తే పంచ... Read more
Jan 11 | పెళ్ళి మొదలుకుని ఎటువంటి పూజాది క్రతువులు అయినా, పట్టు వస్త్ర ధారణ, ఆడవారికీ - మగవారికీ కూడా సూచించింది హిందూ సాంప్రదాయం. ఆడవారికీ పట్టు వస్త్రాలకీ అవినాభావ సంబంధం ఉంది. రక రకాల రంగుల్లో,... Read more
Jan 09 | మౌనము అంటే, ముని వ్రుత్తి... మునులు ఆచరించే విధానం అని అర్ధం. మనకు పంచ జ్ఞ్యానేన్ద్రియాలు ఉన్నాయి. శరీరం, కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు. వీటన్నిటికీ మౌనాన్ని ఇవ్వడమే మౌన వ్రతాన్ని ఆచరించడం. శరీరాన్ని... Read more
Jan 07 | బల్లి ... ఈ పేరు వినగానే, ఈ పేరుకి అధిపతి అయిన జీవిని చూడగానే, మనకే తెలియని ఛీదరింపు, మనల్ని ఆవహిస్తుంది... ఇళ్ళల్లో గూడలకి అతుక్కుని ఉండే బల్లి పొరపాటున మనమీద, లేక వంటకాల... Read more
Jan 06 | సీతా దేవి, మారు వేషంలో ఉన్న రావణాసురుడికి భిక్ష వేసేందుకు లక్ష్మణ రేఖ దాటే ముందు, ఆమె కుడి కన్ను అడిరిందట... ఒకానొక మహా కవి, తన రామాయణంలో ఈ అంశాన్ని పొందుపరిచారు...కళ్ళు అదరడం,... Read more