ఆధ్యాత్మిక, చారిత్రాత్మక సంపదగల భారతదేశంలో కొన్ని ఆలయాలు చరిత్రపుటలో మరుగునపడుతున్నాయి. ఒక్కసారి వాటిని పరిశీలిస్తే.. నమ్మలేని అద్భుత గాధలు తెలుసుకోవచ్చు. అలాంటి ఆలయాల్లో ‘భోగేశ్వరాలయం’ ఒకటి. కాకతీయ సామ్రాజ్యంలో నిర్మించబడిన ఈ ఆలయం.. వరంగల్ రైలు స్టేషన్ కి మూడు కిలోమీటర్ల దూరంలోని మట్టెవాడ ప్రాంతంలో వుంది. ఈ ఆలయానికి ‘భోగేశ్వరాలయం’ అనే పేరు రావడం వెనుక ఓ పురాణ కథ అమలులో వుంది. ప్రతిరోజూ రాత్రిపూట ఒక పాము ఇక్కడికొచ్చి ఈశ్వరుని సేవించేదట. భోగిచేత సేవించబడినవాడు కాబట్టి.. ఈ ఆలయానికి ‘భోగేశ్వరుడు’ అని పేరొచ్చిందని అంటుంటారు.
ఈ ఆలయం చూడటానికి చాలా సాధారణంగానే వున్నప్పటికీ.. ఎన్నో విశిష్టతలను కలిగివుంది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాలంటే.. ఈ ఆలయంలో స్వామివారు కొలువైన తీరు ఎంతో విశేషమైంది. శివలింగం కింద లింగం, మళ్ళీ దాని కింద మరో లింగం... అలా 11 లింగాలు వున్నాయట. అయితే.. అవి కనబడవు. పానవట్టముమీద పైనున్న లింగభాగాన్ని జరపటానికి వీలుగా వున్నది. దాని క్రింది భాగం బోలుగా వుంటుంది. ఇక్కడ అడుగుభాగంలో శివలింగం కింద మేరు ప్రస్తారంలో శ్రీ చక్రం వుందట. శీచక్రం బిందుస్ధానంలో మరొక చిన్న రాతి శివలింగం వుంది. అంటే.. అక్కడ ఒక పెద్ద శ్రీ చక్రము, ఆ శ్రీచక్రబిందు స్ధానంలో ఒక లింగము, శ్రీ చక్రాన్ని కప్పివేస్తూ నిర్మించిన పెద్దపానవట్టము, ఆ పానవట్టముమీద కదల్చటానికి వీలుగా చెక్కిన మరొక శివలింగము వున్నాయి. దానికింద పదకొండు శివ లింగాలు వున్నాయని, అందుకే ఈ భోగేశ్వర స్వామికి ఒక్కసారి అభిషేకంచేస్తే ఏకాదశరుద్రాభిషేకం చేసిన ఫలితం దక్కుతుందంటారు.
ఈ ఆలయంలో మరొక విశేషం ఏమిటంటే.. ఇక్కడ ఎన్ని బిందెలనీళ్ళతో శివలింగానికి అభిషేకం చేసినా.. ఆ నీరు ఒక్క చుక్కైనా బయటికి రాదు.. ఎక్కడికి పోతుందో కూడా తెలీదు. ఈ లింగానికి వెనుక భాగంలో పార్వతీ పరమేశ్వరుల విగ్రహం కూడా ప్రతిష్టించబడింది. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ ఆలయం ప్రసిద్ధి చెందకపోవడానికి కొన్ని వాస్తుదోషాలు వున్నాయని చెబుతారు. అవేమిటంటే.. స్వామి ఉత్తర ముఖంగా వున్నాడు. అంటే పూజించేవారు దక్షిణ ముఖంగా వుండి చెయ్యాలి. అది శాస్త్ర సమ్మతం కాదంటారు. నైఋతిలో బావి వుందన్నారు కానీ వాస్తుదోషం కారణంగా దానిని మూసేశారుట. ఆలయ ప్రవేశద్వారం ఈశాన్యంలో వున్నది. ఇదికూడా వాస్తు శాస్త్ర విరుధ్ధమే. ఈ ఆలయంలో శివరాత్రి వగైరా పర్వదినాలలో ప్రత్యేక పూజలే కాక మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రంరోజున ద్వార దర్శనం వుంటుంది.
(And get your daily news straight to your inbox)
May 31 | భాగ్యనగరంలో ఏటా నిర్వహించే హనూమాన్ జయంతి వేడుకల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. స్వామివారీ సేవలతో మొదలయ్యే ఈ వేడుకలు శోభాయత్రతో ఘనంగా ముగుస్తాయి. ఏటా చైత్ర పౌర్ణమిరోజు హన్ మాన్ (చిన్నజయంతి),... Read more
Jan 13 | అర్జునుడి మునిమనవడైన నరేంద్రుడు, తప్పని పరిస్థితుల్లో ఋషిని హత్యచేసాడు... ఇందుకు ఎంతో పశ్చ్యాతాపపడ్డాడు... ఎలా అయిన "బ్రహ్మ" హత్యా దోషాన్ని పోగొట్టుకోవాలి అనుకున్నాడు... అన్ని ప్రాంతాలు సందర్శిస్తూ, అన్ని ఆలయాలలో పూజలు చేయ్యసాగాడు... కానీ,... Read more
Nov 24 | భారతదేశంలో వెలిసిన అత్యంత పురాతనమైన ఆలయాల్లో... వరంగల్ జిల్లాలోని అయినవోలు గ్రామంలో వెలిసిన మల్లికార్జున స్వామివారి దేవాలయం ఒకటి. విశాల ప్రాంగణంలో ఎంతో అద్భుతంగా వెలిసిన ఈ ఆలయం.. కాకతీయుల కాలంలో నిర్మింపబడింది. కాకతీయ... Read more
Nov 21 | సోమనాథ్ క్షేత్రం.. మహాశివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఈ క్షేత్రం గుజరాత్ రాష్ట్రంలో సౌరాష్ట్రా ప్రాంతంలోని వెరావల్‌లో వుంది. దీనిని ‘ప్రభాస తీర్థం’ అని కూడా పిలుస్తారు. స్థలపురాణం ప్రకారం.. ఈ ఆలయాన్ని చంద్రుడు... Read more
Nov 03 | పూర్వం... దక్షుడు తలపెట్టిన యాగానికి అల్లుడైనా పరమ శివుని పిలవడు. ఎందుకంటే.. ఏదో ఓ సందర్భంలో శివుడు తనని చూసి కూడా పలకరించకపోవడంతో దక్షుడు ఆగ్రహానికి గురవుతాడు. అందుకు ప్రతీకారంగానే ఆయన శివుడిని ఆహ్వానించడు.... Read more