మహాభారతంలో కీలకపాత్రుడైన కర్ణుడు.. ఆనాడు దాకకర్ణుడనని ప్రసిద్ధి. తనకు తోచించి ఇతరులకు దానం చేయడంలో ఇతను దిట్ట. బంగారమైనా, మరేమైనా సరే.. దానం చేయడంలో కర్ణుడిని మించినవాడు ఎవడూ లేడు. పైగా.. కృష్ణుడు సైతం కర్ణుడిని నిత్యం దానకర్ణడని అభివర్ణించేవాడు. అయితే.. ఈ విషయం అర్జునుడికి నచ్చలేదు. ఒకానొక సందర్భంలో వారిద్దరి మధ్య వాద్యుద్ధం కూడా జరిగింది. కర్ణుడిని దానకర్ణుడిగా అభివర్ణించొద్దని అర్జునుడి చెప్పడం.. దానం చేయడంలో అతనికిమంచి మరొకడు లేడని కృష్ణుడు అనడం.. ఇలా చాలాసేపే మాటల సాగాయి. చివరికి లాభం లేదనుకున్న కృష్ణుడు.. ఒక చిన్న నాటకం ఆడుతాడు.
కృష్ణుడు వెంటనే బంగారు పర్వతాన్ని సృష్టిస్తాడు. అప్పటినుంచి అసలు కథ మొదలవుతుంది. కృష్ణుడు తాను సృష్టించిన బంగారు పర్వతాన్ని అర్జునుడికి చూపిస్తాడు. ఆ పర్వతాన్ని సాయంత్రంలోపు ఒక్క ముక్క మిగల్చకుండా దానం చెయ్యాలని చెబుతాడు. ‘అలా చేస్తే.. దానం చేయడంలో కర్ణుడి కన్నా నువ్వే గొప్పవాడిగా కొనియాడుతాను’ అని కృష్ణుడు చెబుతాడు. ఆ ఒప్పందానికి అర్జునుడు సరేనని.. తాను బంగారు పర్వతాన్ని దానం చేయబోతున్నానంటూ ఊరంతా ప్రచారం చేయిస్తాడు. దాంతో ఊరిలో వున్న ప్రజలంతా అక్కడికి తరలి వస్తారు. అప్పుడు అర్జునుడు ఆ పర్వం నుంచి బంగారాన్ని ముక్కలు ముక్కలుగా చేసి దానం చెయ్యడం ప్రారంభిస్తాడు. అతడు దానం చేస్తూనే వుంటాడు కానీ.. పర్వతం మాత్ర తగ్గదు. ఓవైపు జనాల వరుస అయిపోతోంది.. అయినప్పటికీ ఆ పర్వతం అయిపోవడం లేదు. చివరికి.. కృష్ణుడు చెప్పినట్టుగా సాయంత్రంలోపు అర్జునుడు దానం చెయ్యలేకపోతాడు. సగం కూడా దానం చేయలేడు.
ఇంతలోనే ఆవైపుగా కర్ణుడు వస్తాడు. కృష్ణుడు అతనిని పిలిచి ‘కర్ణా...ఈ బంగారు పర్వతాన్ని రేపు ఉదయంలోపు దానం చెయ్యాలి.. నీ వల్ల అవుతుందా’ అని అడుగుతాడు. కర్ణుడు బదులిస్తూ.. ‘అదేం పెద్ద పని కాదే.. ఇది దానం చెయ్యాలి అంతేగా’ అని అంటాడు. అదే సమయంలో అటు వచ్చిన ఇద్దరిని కర్ణుడు పిలిచి.. ‘ఈ బంగారు పర్వతాన్ని మీ ఇద్దరికీ దానం చేస్తున్నాను.. దీనిని మీరిద్దరూ సరిసమానంగా పంచుకోండి’ అని ఆ ఇద్దరి ఆ బంగారాన్ని ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు అర్జునునివైపు కృష్ణుడు చూసి ‘ఇప్పుడు నీకు, కర్ణుడికి మధ్య ఉన్న తేడా తెలిసిందా...? ఈ పర్వతాన్ని పూర్తిగా ఇచ్చేయ్యాలనే ఆలోచన నీకు రానే లేదు. మరి నిన్ను దానం చేయడంలో కర్ణుడిని మించిన వాడివని ఎలా కొనియాడను’ అని ప్రశ్నిస్తాడు. దాంతో అర్జునుడి నోటంట ఒక్క మాట రాదు.
(And get your daily news straight to your inbox)
Nov 18 | పూర్వం భక్తులు తమతమ ఇష్టదైవాలను ఎంతగా తమ భక్తిని చాటుకున్నారంటే.. సాక్షాత్తూ దేవుళ్ళే స్వయంగా భువికి దిగివచ్చి వారి కోర్కెల్ని నెరవేర్చేవారు. అలా తన భక్తితో వెంకటేశ్వరుడు మెప్పించిన అపరభక్తుడు బావాజీ.. ఆయనతో కలిసి... Read more
Nov 06 | పూర్వం.. చ్యవనుడు అనే మహర్షికి సుకన్య అనే రాజకుమార్తెతో వివాహం అయ్యింది. చ్యవనుడు అంధుడు మాత్రమే కాకుండా చాలా ముసలివాడు అయినప్పటికీ.. కుందనపుబొమ్మలా వుండే సుకన్య తన యవ్వనాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా పతివ్రతా నియమంతో... Read more
Nov 02 | స్వర్గానికి అధిపతి అయిన ఇంద్రునికి అహంకారం ఎక్కువ. భువిపై వున్న మానవులందరూ తన దయాదాక్షిణ్యాల మీదే ఆధారపడి ఉన్నారనీ, తనని భయభక్తులతో కొలిస్తే కానీ వారికి మనుగడ వుండదని విర్రవీగుతుంటాడు. అయితే.. కృష్ణుడు అతని... Read more
Oct 07 | పూర్వం ‘పులోమ’ అనే అతిలోక సౌందర్యవతి వుండేది. ఆమె సౌందర్యానికి ఆకర్షితుడైన ‘పులోముడు’ అనే దైత్యుడు.. ఆమెను ఎలాగైనా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అలా అనుకున్న వెంటనే తన మనోరథాన్ని పులోమ తండ్రికి తెలిపాడు.... Read more
Jul 03 | రామాయణంలో వున్న ఒక్కొక్క పాత్రకు ఒక్కొక్క కథామిషూ వుంటుంది. వారు మంచివారయినా కావొచ్చు... లేదా ధర్మానికి విరుద్ధంగా నడుచుకునే హీనులైనా అయి వుండొచ్చు. అటువంటి పాత్రలలోనే ‘‘వాలి’’ కథ కూడా ఒకటి. పూర్వం వాలి,... Read more