(Image source from: The Story Of Vali in Telugu)
రామాయణంలో వున్న ఒక్కొక్క పాత్రకు ఒక్కొక్క కథామిషూ వుంటుంది. వారు మంచివారయినా కావొచ్చు... లేదా ధర్మానికి విరుద్ధంగా నడుచుకునే హీనులైనా అయి వుండొచ్చు. అటువంటి పాత్రలలోనే ‘‘వాలి’’ కథ కూడా ఒకటి.
పూర్వం వాలి, సుగ్రీవులు అనే ఇద్దరు సోదరులు వుండేవారు. వీరిద్దరిలో సుగ్రీవుడు ఎంత ఉత్తముడో... వాలి అంత హీనుడు. ఇద్దరూ చూడటానికి ఒకేరకంగా వుండటం వల్ల... వాలి దానిని అదునుగా తీసుకుని ఎన్నో పాపాలను చేసి, వాటిని సుగ్రీవుని మీద మోసేసేవాడు. అలాగే సుగ్రీవుడు చేసే మంచి పనులకు ఇతను చేసినట్టుగా నలుగురిలో చెప్పుకునేవాడు.
ఒకనాడు... ఏ విధంగా అయితే రావణాసురుడు, సీతమ్మకు అపహించుకుపోయాడు... అదేవిధంగా వాలి కూడా సుగ్రీవునిని బాగా కొట్టి, గాయపరిచి.. అతని భార్య అయిన ‘‘రుమ’’ను ఎత్తుకుపోతాడు. ఆమెను కిష్కింధలో బంధించి దాచేస్తాడు. ఈ ఘోర అవమానాన్ని భరించలేక సుగ్రీవుడు తన రాజ్యం నుంచి పారిపోయి ఋష్యమూకపర్వతంపై నివాసాన్ని ఏర్పరుచుకుంటాడు.
కొన్నాళ్ల తరువాత అతనున్న ప్రదేశానికి సీతాన్వేషణ కోసం బయలుదేరిన రామలక్ష్మణులు, హనుమంతులు, వారి సైన్యం తదితరులు అక్కడికి చేరుకుంటారు. మొదట్లో సుగ్రీవుడు వారిని చూసి, తనను చంపడానికి వచ్చినవారని భావించి హనుమంతుడితో గొడవ పడతాడు. అనంతరం రాముడిని చూసి తన తప్పును ఒప్పుకుని, తన సోదరుడు చేసిన దురాగతాన్ని వారికి వివరిస్తాడు. అతని విషాదగాధను విన్న రామదండు.. అతని రాజ్యాన్ని, భార్యని తిరిగి రప్పించేలా సహాయం చేస్తామని మాటిస్తారు.
రాముడు ఇలా చెబుతుండగానే సుగ్రీవుడు... ‘‘వాలి ఎంతో బలశాలి. అన్ని జయించడం అంత సులభం కాదు’’ అని చెబుతాడు. అప్పుడు రాముడు చిరునవ్వుతో తన వీలును తీసి, ఒకే ఒక్క బాణంతో ‘‘సప్తతాళశ్రేణి’’ని (ఏడు తాటిచెట్ల వరుస) కూల్చేస్తాడు. అది చూసిన సుగ్రీవుడు... రాముడు ఎంతటి పరాక్రమబలవంతుడో తెలుసుకుంటాడు.
ఇది గడిచిన కొన్నాళ్ల తరువాత శ్రీరాముడు చెప్పినట్లుగానే.. సుగ్రీవుడు, వాలిని యుద్ధానికి పిలుస్తాడు. దాంతో వారిద్దరి మధ్య భీకరమైన యుద్ధం కొనసాగుతుంది. ఒక చెట్టుచాటులో వున్న శ్రీరాముడు, వాలికి సూటిగా బాణం వేయగా అది అతనికి తగులుతుంది. ఆ దెబ్బకు మూర్ఛపడిపోయిన వాలి... ‘‘చెట్టు చాటు నుంచి ఇలా దాడి చేయడం న్యాయమా’’ అని చెబుతాడు.
అతని చెప్పిన మాటలకు రాముడు కోపాద్రిక్తుడై... ‘‘తమ్ముణ్ణి చావకొట్టి.. అతని భార్యను అపహరించుకుపోవడం న్యాయమా?’’ అని ప్రశ్నిస్తాడు. అప్పుడు వాలి తన తప్పును తెలుసుకుని, క్షమించమని పశ్చాత్తాపడతాడు. ‘‘హే రామా! నీలాంటి మహోన్నత వ్యక్తి చేతిలో చావడం నా భాగ్యం’’ అంటూ తుది శ్వాసను విడుస్తాడు. సుగ్రీవుడు, రాముని సహాయంతో తన భార్యతోపాటు తన రాజ్యం అయిన కిష్కింధను దక్కించుకుంటాడు.
(And get your daily news straight to your inbox)
Nov 18 | పూర్వం భక్తులు తమతమ ఇష్టదైవాలను ఎంతగా తమ భక్తిని చాటుకున్నారంటే.. సాక్షాత్తూ దేవుళ్ళే స్వయంగా భువికి దిగివచ్చి వారి కోర్కెల్ని నెరవేర్చేవారు. అలా తన భక్తితో వెంకటేశ్వరుడు మెప్పించిన అపరభక్తుడు బావాజీ.. ఆయనతో కలిసి... Read more
Nov 06 | పూర్వం.. చ్యవనుడు అనే మహర్షికి సుకన్య అనే రాజకుమార్తెతో వివాహం అయ్యింది. చ్యవనుడు అంధుడు మాత్రమే కాకుండా చాలా ముసలివాడు అయినప్పటికీ.. కుందనపుబొమ్మలా వుండే సుకన్య తన యవ్వనాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా పతివ్రతా నియమంతో... Read more
Nov 02 | స్వర్గానికి అధిపతి అయిన ఇంద్రునికి అహంకారం ఎక్కువ. భువిపై వున్న మానవులందరూ తన దయాదాక్షిణ్యాల మీదే ఆధారపడి ఉన్నారనీ, తనని భయభక్తులతో కొలిస్తే కానీ వారికి మనుగడ వుండదని విర్రవీగుతుంటాడు. అయితే.. కృష్ణుడు అతని... Read more
Oct 07 | పూర్వం ‘పులోమ’ అనే అతిలోక సౌందర్యవతి వుండేది. ఆమె సౌందర్యానికి ఆకర్షితుడైన ‘పులోముడు’ అనే దైత్యుడు.. ఆమెను ఎలాగైనా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అలా అనుకున్న వెంటనే తన మనోరథాన్ని పులోమ తండ్రికి తెలిపాడు.... Read more
Sep 22 | మహాభారతంలో కీలకపాత్రుడైన కర్ణుడు.. ఆనాడు దాకకర్ణుడనని ప్రసిద్ధి. తనకు తోచించి ఇతరులకు దానం చేయడంలో ఇతను దిట్ట. బంగారమైనా, మరేమైనా సరే.. దానం చేయడంలో కర్ణుడిని మించినవాడు ఎవడూ లేడు. పైగా.. కృష్ణుడు సైతం... Read more