‘అధిక మాసం’.. ఈ పదాన్ని అప్పుడప్పుడు వింటూవుంటాం. ఇంతకీ ఆ మాసమేంటి? అది ఎందుకు వస్తుంది? అనే ప్రశ్నలకు కొందరి దగ్గర జవాబులు వుండవు. ఆ విషయాలను ఓసారి పూర్తిగా తెలుసుకుందాం...
పంచాంగ గణనం ప్రకారం.. సంవత్సరాన్ని సౌరమాన, చాంద్రమాన పద్ధతులలో లెక్కిస్తారు. ఈ రెండు సంవత్సరాలకు మధ్య పదకొండుంపావు రోజుల తేడా వుంటుంది. వాటిల్లో సౌరమాన సంవత్సరం కంటే చాంద్రమాన సంవత్సరం తక్కువ వ్యవధి కలిగి వుంటుంది. అదేవిధంగా చాంద్రమాన మాసం కూడా చిన్నదే. ఈ తేడా కారణంగా అప్పుడప్పుడు చాంద్రమాన మాసంలో సౌరమానం ప్రారంభం కాదు. అలాంటి సందర్భంలో సూర్య సంక్రాంతి లేని చాంద్రమాసానికి ‘అధికమాసం’ అని పిలువడం జరుగుతుంది. సౌరమానం, చంద్రమానాల్లో వున్న తేడా కారణంగా సూర్యుడు ఒకే రాశిలోనే ఒక నెలకంటే ఎక్కువకాలం సంచరించాల్సి వస్తుంది. దానినే అధికమాసం అంటాం. ఇందులో మొదటి నెలలో రవి సక్రాంతి వుండదు. ఈ అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం అని కూడా అంటాం. ఈ ఏడాదిలో జూన్ 17వ తేదీ నుంచి అధిక ఆషాడమాసం వచ్చింది.
సాధారణంగా.. ఒక నెలను కొలవటానికి చంద్రుడు భూమిచుట్టూ తిరగడాన్ని ప్రమాణంగా తీసుకుంటాం. భూమిచుట్టూ చంద్రుడు ఒక్కసారి తిరిగితే అది నెల కింద లెక్క. దానినే చాంద్రమానం అని అంటారు. అయితే.. అలా 12 రాశులలో చంద్రుడు తిరిగిన సమయాన్ని మనం సంవత్సరం కింద లెక్కపెట్టలేం. ఎందుకంటే.. సూర్యమానానికి, చంద్రమానానికి మధ్య పదకొండుంపావు రోజుల తేడా వుంది కాబట్టి. అదే సూర్యుడు 12 రాశులలో ఒక్కోరాశిలో ఒక్కోనెల సంచరించడాన్ని సౌరమానం అంటాం. సూర్యుడు ఒక రాశిలో నుంచి మరో రాశిలోకి ప్రవేశించడాన్ని రాశి సంక్రమణం అంటారు. ఈ సంక్రమణం అనేది ప్రతి నెలలోనూ జరుగుతుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్నే మనం ‘మకర సంక్రాంతి’ పేరుతో పండుగలా జరుపుకుంటాం.
(And get your daily news straight to your inbox)
Nov 17 | ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నప్పుడు ఒకరినొకరు నమస్కరించుకోవడం భారతీయ సంస్కారం. ఇలా పలకరించుకునే పద్ధతి ఒక్కొక్క జాతిలో ఒక్కో విధంగా వుంటుంది. అవి.. వారివారి సంస్కృతీసంప్రదాయాలు, నాగరికతపై ఆధారపడి వుంటుంది. అయితే.. ఈ పలకరింపులన్నింటిలో భారతీయులది... Read more
Nov 10 | ఏ దేవునికైనా సరే.. పూజ చేసే సమయంలో పుష్పాలు వినియోగించడం ప్రాచీనకాలం నుంచి ఆచారంగా మారిపోయింది. అయితే.. ఈ పుష్పాలు కచ్చితంగా ఎందుకు వినియోగించాలి..? వాటివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి..? అనే విషయాలు చాలామందికి... Read more
Nov 05 | గుడికి వెళ్లిన భక్తులు చాలామంది గుడివెనకున్న భాగాన్ని సైతం మొక్కుతుంటారు. ఇలా ఒక్క దేవాలయంలోనే కాదు.. ప్రతిఒక్క ఆలయంలోనూ భక్తులందరూ ఆచరిస్తారు. అయితే.. ఇలా చేయడం వెనుకగల కారణాలు చాలామందికి తెలిసి వుండదు. ఏదో... Read more
Oct 16 | పూర్వకాలంలో ఋషులు ఎక్కువకాలం ధ్యానంలోనే గడిపేవారు. అంటే తపస్సు చేస్తుండేవారు. ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా ప్రశాంత వాతావరణంలో కూర్చొని, దేవుడి నామాన్ని స్మరిస్తూ నిరంతర ధ్యానంలోనే వుండేవారు. ఇంతకీ ఈ తపస్సు వల్ల... Read more
Oct 09 | సాధారణంగా అన్ని దేవాలయాలలో ప్రవేశద్వారానికి దగ్గర పైకప్పు నుంచీ ఒకటి లేదా ఎక్కువ గంటలు వ్రేలాడ దీయబడి ఉంటాయి. భక్తుడు ఆలయంలోకి వెళ్ళగానే గంట మ్రోగించి ఆ తరువాతనే భగవంతుని దర్శనానికి, ప్రార్ధనలకి ఉపక్రమిస్తాడు.... Read more