తూర్పు గోదావరి జిల్లాలో వున్న పుష్కరక్షేత్రంగా పిలువబడే ఈ పిఠాపురం క్షేత్రం.. అనేక పురాతన ఆలయాలకు ప్రసిధ్ధి చెందింది. వాటిల్లో ‘శక్తి పీఠం’గా పిలువబడే ‘శక్తి పురుహూతిక’ ఒకటి. అష్టాదశ శక్తి పీఠాలలో పదవ శక్తి పీఠమిది. అమ్మవారి పీఠము (పిరుదులు) పడ్డ ప్రదేశము గనుక అమ్మవారిని పీఠాంబిక అన్నారు. పిఠాపురంలో ప్రసిధ్ధి చెందిన పురాతన ఆలయం శ్రీ కుక్కుటేశ్వరస్వామి ఆలయంలోనే వున్న ఈ శక్తి ఆలయం వుంది. ఈ ఆలయం చిన్నదే అయినా.. బయట గోడలకి వున్న శక్తి పీఠాలలోని అమ్మవారి మూర్తులతో అందంగా వుంటుంది. ఇక్కడ అమ్మవారు చతుర్భుజ.. అత్యద్భుత సౌందర్యరాశి. అమ్మవారి దగ్గర శ్రీచక్రం వుంటుంది. ఈవిడకి పురుహూతిక అనే పేరు రావటానికి ఒక కధ చెబుతారు. పూర్వం ఇంద్రుడు, గౌతమ మహర్షి భార్య అయిన అహల్యని మోసం చేస్తాడు. మహర్షి శాపంతో సహస్రాక్షుడవుతాడు. ఆ శాపం పోగొట్టుకోవటానికి ఇంద్రుడు జగజ్జనని కోసం తపస్సుచేసి, ఆవిడ ఆశీర్వాదంతో తన శాపం పోగొట్టుకుంటాడు. పురుహూతుడు (ఇంద్రుడు) ఆరాధించిన దేవి గనుక ఈవిడ పురుహూతిక అయింది.
అష్టాదశ పీఠాల గాధ :
పూర్వం... దక్షుడు తలపెట్టిన యాగానికి అల్లుడైనా పరమ శివుని పిలవడు. అటు.. పుట్టింటి మీద ఆశతో కన్నవారింటికి వెళ్ళిన సతీదేవి తన భర్తకి జరిగిన అవమానాన్ని తన అవమానంగా భావించి.. అప్పటికప్పుడే యోగాగ్నిలో దూకి తనువు చాలింది. అది తెలిసిన శివుడు.. సతీ వియోగాన్ని భరించలేక దక్షయజ్ఞను నాశనం చేయడం కోసం వీరభద్రుణ్ణి సృష్టిస్తాడు. అదే సమయంలో సతీదేవిని తన శరీరం భుజాన వేసుకుని దుఃఖంతో పరిశ్రమించడం మొదలుపెడతాడు. లోక రక్షణకోసం శివుణ్ణి యధాస్ధితికి తీసుకురావటానికి శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండిస్తాడు. ఆ భాగాలు 101 ప్రదేశాలలో పడ్డాయి. ఆ భాగాల్లో తొలుత 56 ముఖ్యమైనవిగా పేరుగాంచాయి కానీ.. కాలాంతరంలో 18 ముఖ్యమైనవిగా నిలబడ్డాయి. వాటినే అష్టాదశ పీఠాలు అంటారు. వాటిల్లో శక్తిపీఠం పదవది.
(And get your daily news straight to your inbox)
Sep 11 | శాంతించిన రాముడితో లక్ష్మణుడు " అన్నయ్యా! చూశావ లోకం యొక్క పోకడ ఎలా ఉంటుందో. కష్టాలు అనేవి ఒక్కరికే కాదు, గతంలో కూడా కష్టపడినవారు ఎందరో ఉన్నారు. నహుషుని కుమారుడైన యయాతి ఎంత కష్టపడ్డాడో... Read more
Sep 07 | త్వయా ఏవ నూనం దుష్టాత్మన్ భీరుణా హర్తుం ఇచ్ఛతా | మమ అపవాహితో భర్తా మృగ రూపేణ మాయయా || రావణుడి చేత ఎత్తుకుపోబడుతున్న సీతమ్మ ఇలా అనింది " నువ్వు మాయా మృగాన్ని... Read more
Sep 06 | అప్పటిదాకా రథంలో ఉన్న రావణుడు, లక్ష్మణుడు కంటికి కనపడనంత దూరానికి వెళ్ళాక, ఆ రథం నుండి కిందకి దిగి కామరూపాన్ని దాల్చాడు. మృదువైన కాషాయ వస్త్రాలని ధరించి, ఒక పిలక పెట్టుకుని, యజ్ఞోపవీతం వేసుకుని,... Read more
Sep 03 | రావణుడు, మారీచుడు ఇద్దరూ కలిసి రాముడున్న ఆశ్రమం దెగ్గర రథంలో దిగారు. అప్పుడా మారీచుడు ఒక అందమైన జింకగా మారిపోయాడు. దాని ఒళ్ళంతా బంగారు రంగులో ఉంది, దానిమీద ఎక్కడ చూసినా వెండి చుక్కలు... Read more
Aug 27 | అందరూ వెళ్ళిపోయాక రావణుడు నిశ్శబ్ధంగా వాహనశాలకి వెళ్ళి సారధిని పిలిచి ఉత్తమమైన రథాన్ని సిద్ధం చెయ్యమన్నాడు. అప్పుడు రావణుడు బంగారంతో చెయ్యబడ్డ, పిశాచాల వంటి ముఖాలు ఉన్న గాడిదలు కట్టిన రథాన్ని ఎక్కి సముద్ర... Read more