పంచరామా క్షేత్రాల్లో ఒకటైన ద్రాక్షారామంలో మాణిక్యాంబ శక్తిపీఠం వుంది. అష్టాదశ శక్తి పీఠాలలో 12వది అయిన మాణిక్యాంబ శక్తి పీఠం.. ఇక్కడ భీమేశ్వరస్వామి ఆలయంలో వుంది. పూర్వం దక్షప్రజాపతి ఇక్కడ యజ్ఞం చేశాడు కాబట్టి.. ఈ క్షేత్రానికి ‘దాక్షారామం’ అనే పేరొచ్చింది. అలాగే ద్రాక్ష తోటలు ఎక్కువ వుండేవి కాబట్టి.. ‘ద్రాక్షారామం’ అన్నారు.
పురాణగాధ :
పూర్వం.. దక్షుడు చేపట్టిన యజ్ఞానికి అందరినీ ఆహ్వానించాడు కానీ, తన అల్లుడైన శివుణ్ణి ఆహ్వానించలేదు. ఎందుకంటే.. అంతకు ముందెప్పుడో శివుడు తనని చూసి పలకరించలేదనీ, అభివాదం చేయలేదని కోపంతో ఆయన్ను ఆహ్వానించలేదు. మరోవైపు.. ఈ యజ్ఞం గురించి పార్వతీ దేవికి తెలిసింది. పుట్టింట్లో యజ్ఞం జరుగుతోంది కాట్టి.. ఆ సంబరంలో తానూ పాల్గొనాలని భావించి.. తనను పుట్టింటికి తీసుకువెళ్లాల్సిందిగా శివుడిని కోరుతుంది. కానీ శివుడు జగదీశ్వరుడు కదా... తనను పిలవని పేరంటానికి వెళ్ళకూడదు, వద్దు అని నీతి చంద్రిక తిరగేశాడు. కానీ.. ఎలాగోలా పరమేశ్వరుడిని పార్వతీదేవి ఒప్పించి, పుట్టింట్లో జరిగే యజ్ఞానికి వెళ్ళింది. అక్కడికివెళ్లిన అనంతరం ఎవరూ ఆమెని పలకరించలేదు. ప్రేమాదరాలు చూపించలేదు.
దాంతో తీవ్ర ఆగ్రమానికి గురైన పార్వతీదేవి... భర్త మాట వినకుండా వచ్చినదానికి పశ్చాత్తాపపడింది. ఇటు పుట్టింట్లోనూ వుండలేక, అటు శివుడి దగ్గరకెళ్ళి తనకు జరిగిన అవమానం చెప్పుకోలేక, తనని తను కాల్చుకుని బూడిద అయింది. ఈ విషయం తెలిసిన శివుడు ప్రళయ రుద్రుడయ్యాడు. తన జటాజూటం నుంచి వీరభద్రుణ్ణి సృష్టించాడు. ఆయన వెళ్ళి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. పత్నీ వియోగాన్ని భరించలేని శివుడు.. పార్వతి సూక్ష్మ శరీరాన్ని భుజంమీద పెట్టుకుని ఆవేశంతో ప్రళయ తాండవం చేశాడు. శివుణ్ణి ఆపటానికి విష్ణువు పార్వతీ దేవి శరీరాన్ని తన చక్రాయుధంతో ముక్కలు చేశాడు. ఆ శరీరం ముక్కలయి అనేక చోట్ల పడ్డాయి. ఆ ప్రదేశాలన్నీ శక్తి పీఠాలుగా వెలిశాయి. వాటిలో ముఖ్యమైనవి 18 అష్టాదశ శక్తి పీఠాలు. వాటిల్లో మాణిక్యాంబ శక్తిపీఠం 12 వది.
ఆలయ విశేషాలు :
మిగతా శక్తి పీఠాలతో పోల్చితే.. మాణిక్యాంబ శక్తి పీఠానికి ఒక భిన్నమైన విశిష్టత వుంది. దాదాపు అన్ని శక్తి పీఠ క్షేత్రాలలో అమ్మవారి విగ్రహం శ్రీచక్ర యంత్రం వేరుగా వుంటాయి. కానీ ద్రాక్షారామంలో మాణిక్యాంబదేవిని శ్రీచక్ర యంత్రంపై ప్రతిష్టించడం వల్ల శ్రీచక్రయంత్రానికి, అమ్మవారికీ ఏకకాలంలో పూజలు జరుగుతాయి. ద్రాక్షారామంలో గల శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామివార్ల దేవాలయం అతి ప్రాచీన సుప్రసిద్ధ శైవ క్షేత్రం. ఈ ఆలయాన్ని క్రీ.శ. 7, 8 శతాబ్ధాల మధ్య తూర్పు చాళుక్యుల వంశానికి చెందిన చాళుక్య భీముడు నిర్మించినట్టుగా శాసనాల ద్వారా తెలుస్తొంది. ఇక్కడి మూలవిరాట్ శ్రీ భీమేశ్వర స్వామి స్వయంభుగా వెలసిన 14 అడుగుల శివలింగం, శుద్ధ స్ఫటికాకార లింగం.
ఇక్కడ క్షేత్ర పాలకుడు లక్ష్మీ నారాయణ స్వామి. ఈయన్ని శ్రీ రామచంద్రుడు ప్రతిష్ఠించాడు. గుడి లోపలి ప్రాంగణంలో వీరముడి ఆంజనేయ స్వామి విగ్రహం వుంది. ఈయనకి జుట్టు ముడి వేసి కొప్పులాగా వుంటుంది. గద లేకుండా నమస్కార ముద్రలో వుంటాడు. ప్రక్కనే ఒకే పానువట్టంమీద 108 చిన్న చిన్న శివ లింగాలు వుంటాయి. దాన్ని దర్శిస్తే అన్ని శివాలయాలూ చూసినంత ఫలమట. ఇక్కడ నవగ్రహ మండపమే కాక అష్ట దిక్పాలకులకూ మండపం వుంది. ఇంకా శ్రీ కృష్ణ దేవరాయలు ప్రతిష్ఠించిన విరూపాక్ష స్వామి, రెండు తలల అష్టబంధ నాగేశ్వర స్వామి, కైలాస గణపతి దర్శనీయ దేవతా మూర్తులు. ఏక శిలలో మలచిన నమూనా దేవాలయం ఆలయ ప్రాంగణంలో చూడవచ్చు.
(And get your daily news straight to your inbox)
Sep 11 | శాంతించిన రాముడితో లక్ష్మణుడు " అన్నయ్యా! చూశావ లోకం యొక్క పోకడ ఎలా ఉంటుందో. కష్టాలు అనేవి ఒక్కరికే కాదు, గతంలో కూడా కష్టపడినవారు ఎందరో ఉన్నారు. నహుషుని కుమారుడైన యయాతి ఎంత కష్టపడ్డాడో... Read more
Sep 07 | త్వయా ఏవ నూనం దుష్టాత్మన్ భీరుణా హర్తుం ఇచ్ఛతా | మమ అపవాహితో భర్తా మృగ రూపేణ మాయయా || రావణుడి చేత ఎత్తుకుపోబడుతున్న సీతమ్మ ఇలా అనింది " నువ్వు మాయా మృగాన్ని... Read more
Sep 06 | అప్పటిదాకా రథంలో ఉన్న రావణుడు, లక్ష్మణుడు కంటికి కనపడనంత దూరానికి వెళ్ళాక, ఆ రథం నుండి కిందకి దిగి కామరూపాన్ని దాల్చాడు. మృదువైన కాషాయ వస్త్రాలని ధరించి, ఒక పిలక పెట్టుకుని, యజ్ఞోపవీతం వేసుకుని,... Read more
Sep 03 | రావణుడు, మారీచుడు ఇద్దరూ కలిసి రాముడున్న ఆశ్రమం దెగ్గర రథంలో దిగారు. అప్పుడా మారీచుడు ఒక అందమైన జింకగా మారిపోయాడు. దాని ఒళ్ళంతా బంగారు రంగులో ఉంది, దానిమీద ఎక్కడ చూసినా వెండి చుక్కలు... Read more
Aug 27 | అందరూ వెళ్ళిపోయాక రావణుడు నిశ్శబ్ధంగా వాహనశాలకి వెళ్ళి సారధిని పిలిచి ఉత్తమమైన రథాన్ని సిద్ధం చెయ్యమన్నాడు. అప్పుడు రావణుడు బంగారంతో చెయ్యబడ్డ, పిశాచాల వంటి ముఖాలు ఉన్న గాడిదలు కట్టిన రథాన్ని ఎక్కి సముద్ర... Read more