ఈఏడాది వరుసగా స్విస్ ఓపెన్, థాయిలాండ్ ఓపెన్, ఇండోనేషియా ఓపెన్ టోర్నీల్లో టైటిళ్లు గెల్చుకున్న భారత బాడ్మింటన్ స్టార్, డక్కన్ క్రానికల్ బ్రాండ్ అంబాసిడర్ సైనా నెహ్వాల్‌కు ప్రభుత్వం తరఫున 50 లక్షల నగదు ప్రోత్సాహాన్ని ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. దేశానికి, ముఖ్యంగా మన రాష్ట్రానికి ఆమె వనె తెచ్చిందని ముఖ్యమంత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వరుస విజయాలతో దూసుకెళుతున్న సైనా రానున్న లండన్ ఒలింపిక్స్‌లోనూ ఇదే జోరును కనబరచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంటారన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇండోనేసియా ఓపెన్ టైటిల్ గెల్చుకొచ్చిన సైనా విషయంలో ఆగమేఘాల మీద స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులందరిపట్లా అదే దూకుడును ప్రదర్శించడంలేదు. మన రాష్ట్రానికే చెందిన నాగలక్ష్మి కబడ్డీ ప్రపంచకప్ గెల్చిన జట్టులో సభ్యురాలు. మార్చిలో ప్రపంచకప్ జరిగితే ఆమెకు ఇంతవరకూ ఒక్క పైసా కూడా విదల్చలేదు. వరల్డ్‌కప్ గెలవగానే ఆమె ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, క్రీడామంత్రి వట్టి వసంతకుమార్‌ను కలిసింది.
తప్పకుండా న్యాయం చేస్తామని మాటిచ్చారు కూడా. అయితే అదంతా మాటలకే పరిమితమైంది. తర్వాత ఎన్నిసార్లడిగినా రేపనీ మాపనీ దాటవేయడం మినహా నగదు ప్రోత్సాహకం మాత్రం ప్రకటించలేదు. పతకం గెలిచి రాగానే రాష్ట్ర ప్రభుత్వం తరపున వట్టి వసంతకుమార్.. సైనాను అభినందించేందుకు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వం సైనా విషయంలో చూపిన ఉత్సాహంలో కొంతైనా తనపట్ల చూపినా చాలని నాగలక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. సైనాకు ఇచ్చినందుకు తనకు బాధలేదని, అయితే తానేం పాపం చేశానో చెప్పాలని ఆమె ప్రశ్నిస్తోంది.వరల్డ్‌కప్ గెల్చుకుని హైదరాబాద్ వచ్చినపుడు తనను ఒక్కరు కూడా అభినందించలేదని, తానే అందరివద్దకూ వెళ్లానని ఆమె చెప్పుకొచ్చింది. గ్రామీణ ప్రాంతానికి చెందిన తాను కుటుంబ, ఆర్ధిక సమస్యలున్నా ఎన్నో కష్టనష్టాలకోర్చి అంతర్జాతీయ స్థాయికి ఎదిగానని చెప్పింది.అయినా ఇంత నిరాదరణ ఎదురవుతుందని కలలోనైనా ఊహించలేదని నాగలక్ష్మి ఆవేదన వ్యక్తంచేసింది. ప్రకాశం జిల్లా ఇంకొల్లుకు చెందిన నాగలక్ష్మి రైల్వే క్లర్క్ (పాట్నాలో)గా ఉద్యోగం చేస్తోంది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more