ఐపీఎల్ ఫ్రాంఛైజీ డెక్కెన్ ఛార్జర్స్ టీంని అమ్ముతానంటే కొనేవాళ్ళు కరువయ్యారు. ఈ టీంని కొనేందుకు కనీసం ఎవరూ రావట్లేదని ఛార్జర్స్ టీం పై నిర్ణయం తీసుకోవడానికి అత్యవసరంగా ఏర్పాటు అయిన బీసీసీఐ వర్కింగ్ కమిటీ ఏ నిర్ణయాన్ని వెల్లడించకపోవడం ఈ కారణాలను బలపరుస్తోంది. ఈ ఫ్రాంఛైజీ పై నిర్ణయాన్ని ఈనెల 15 తేదీన జరిగే వర్కింగ్ కమీటీ సమావేశంలో తీసుకోవాలని నిర్ణయించింది. అంతలోపు దీనికి సంబంధించిన ప్రతిక ప్రకటనను ఇవ్వాలని నిర్ణయించింది. అయితే దీనికి సంబంధించిన వ్యవహారాన్ని చక్కదిద్దేందుకు బీసీసీ అధ్యక్షుడు శ్రీనివాసన్ కు పూర్తి అధికారాలు కట్టబెడుతూ బోర్డు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. అయితే ఛార్జన్స్ జట్టును కొనకపోవడానికి ఆ ఫ్రాంఛైజీ న్యాయపరమైన చిక్కుల్లో చిక్కువడమే కాకుండా, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడమే వ్యాపారవేత్తలు ఆ జట్టును కొనడానికి ఆసక్తి చూపలేకపోతున్నారని అంటున్నారు. ఏది ఏమైనా ఒక సారి ఐపీఎల్ కప్ గెలిచిన ఛార్జర్స్ కి, అది మన హైదరాబాద్ జట్టుకి ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరమే.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more