దాదాపు పదకొండు సంవత్సరాల తర్వాత భారత మాజీ కెప్టెన్ మహమ్మద్ అజరుద్దీన్‌కు మ్యాచ్ ఫిక్సింగ్ కేసు నుంచి ఊరట లభించింది. సరైన సాక్ష్యాధారాలు లేవంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ కేసును కొట్టేసి, అజర్‌ను నిర్దోషిగా పేర్కొంది. 2000 సంవత్సరంలో దక్షిణాఫ్రికా జట్టు అప్పటి కెప్టెన్ హన్సీ క్రానే నేతృత్వంలో భారత్‌లో పర్యటించినుప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను ఢిల్లీ పోలీస్‌లు బైటపెట్టిన విషయం తెలిసిందే. బుకీలతో క్రానే తదితులు సాగించిన సంభాషణను ఢిల్లీ పోలీస్‌లు రికార్డు కూడా చేశారు.
ఆతర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో అజర్ సహా వివిధ దేశాలకు చెందిన పలువురు క్రికెటర్లపై వేటు పడింది. కింగ్ కమిషన్ ముందు క్రానే వాంగ్మూలమిస్తూ చెప్పిన పేర్లు క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయి. అజర్ కూడా ఫిక్సింగ్‌లో పాత్రధారేనంటూ క్రానే స్పష్టం చేయడంతో, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) తక్షణమే స్పందించింది. అజర్‌తోపాటు అజయ్ శర్మపై కూడా జీవితకాల సస్పెన్షన్ వేటు వేసింది.
కాగా, తనపై విధించిన జీవితకాల సస్పెన్షన్ చెల్లదంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అజర్ కేసు వేశాడు. పలు మలుపులు తిరుగుతూ వచ్చిన ఈ కేసులో గురువారం రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చింది. నిషేధం చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది. అజర్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు ఆధారాలు లేవని అతని తరఫు లాయర్ రమాకాంత్ రెడ్డి చేసిన వాదనతో అశుతోష్ మహంత, కృష్ణ మోహన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఏకీభవించింది. ఈ తీర్పు తనకు ఎంతో ఊరటనిచ్చిందని అజర్ పేర్కొన్నాడు.
ఇదంతా ఒకెత్తయితే.. ఆ కేసు నమోదైన సమయంలో అజార్ చేసిన వ్యాఖ్యలు క్రీడాభిమానులను తీవ్ర ఆవేదనకు గురిచేశాయి. తాను మైనారిటీ వర్గానికి చెందిన వాడిని కాబట్టే ఇలాంటి కేసులు పెడుతున్నారని అజార్ చెప్పటం యావత్ భారతాన్ని దిగ్ర్భాంతికి గురిచేసింది. ఆతర్వాత రాజకీయల్లో చేరిన అజార్ ను ఆరోపణలను పక్కన పెట్టి భారత ప్రజలు పార్లమెంటుకు పంపిన సంగతి తెలిసిందే..
...avnk
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more