బ్లేడ్ రన్నర్‌గా ప్రసిద్ధుడైన దక్షిణాఫ్రికా అథ్లెట్ ఆస్కార్ పిస్టోరియస్ హత్య కేసులో అరెస్టయ్యాడు. మోడల్ అయిన తన ప్రియురాలు రీవా స్టీన్‌క్యాంప్‌ని పిస్టోరియస్ కాల్చి చంపినట్టు పోలీసులు అభియోగం నమోదు చేశారు. గురువారం తెల్లవారు జామున ఈ ఘటన జరిగినట్టు సమాచారం. ఓ దుండగుడు దొంగతనం చేయడానికి తన ఇంట్లోకి ప్రవేశించాడని భావించి పిస్టోరియస్ కాల్పులు జరిపాడని కథనాలు వినిపించాయి. ప్రిటోరియాలో కట్టుదిట్టమైన భద్రత ఉండే ఓ గేటెడ్ కమ్యూనిటిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. స్టీన్‌క్యాంప్‌పై నాలుగు రౌండ్ల కాల్పులు జరిగాయి. ఈ సంఘటనతో పోలీసులు పిస్టోరియస్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని శుక్రవారం కోర్టు ముందు హాజరుపరిచే అవకాశముంది. ‘అనుమానితుడే నేరం చేశాడు. హత్యతో అతనికి సంబంధం ఉంది. సంఘటన జరిగినప్పుడు ఒక్క వ్యక్తి మాత్రమే తన ఇంట్లో ఉన్నాడు’ అని లెఫ్టినెంట్ కల్నల్ కెట్లాగో మోగాలే తెలిపారు. ఈ సంఘటనలో అనుమానితుడుగా ఉన్న ఒకే ఒక వ్యక్తి పిస్టోరియస్ అని అటూ పోలీసులు... ఇటూ అథ్లెట్ కుటుంబ సభ్యులూ ధ్రువీకరించారు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more