ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్ట్ అయిన శ్రీశాంత్, చండీలాకు ఢిల్లీ కోర్టు బెయిల్ నిరాకరించింది. వారు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. వీరిద్దరికి జూన్ 18వ తేదీ వరకూ జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మిగతా 22 మందికి కూడా ఈ నెల 22వ తేదీ వరకు కస్టడీని పొడగించింది. విందూకు, గురునాథ్ మేయప్పన్‌లకు బెయిల్ మంజూరు చేసి శ్రీశాంత్‌కు నిరాకరించడాన్ని ఆమె వ్యతిరేకించారు. ఇదిలావుంటే, శ్రీశాంత్‌తో పాటు మరో 25 మందిపై ఢిల్లీ పోలీసులు కఠినమైన మోకా నిబంధలను వర్తింపజేస్తున్నారు. మరో పైపు చెన్నై టీమ్ ఓనర్ గురునాథ్ మేయప్పన్, బాలీవుడ్ నటుడు విందూ ధారాసింగ్‌లకు ముంబై కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 25 వేల పూచీకత్తుపై వీళ్లకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఈ ఇద్దరితో పాటు మరో ముగ్గురు బుకీలకు కూడా బెయిల్ మంజూరు అయ్యింది. అలాగే ఎట్టిపరిస్థితుల్లోనూ దేశం విడిచి వెళ్లరాదని షరతు విధించింది. వారంలో రెండు రోజులు ముంబై క్రైం బ్రాంచ్ ముందు హాజరవాలని కూడా ఆదేశించింది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more