క్రికెట్ ఇండియన్ ప్రిమియర్ లీగ్ (బీపీఎల్) ఫీవర్ మెల్లిమెల్లిగా అన్ని క్రీడలకు పాకుతుంది. తాజాగా మనదేశంలో బ్యాడ్మింటన్ కి పాకింది. ప్రపంచ దేశాల బ్యాడ్మింటన్ ప్లేయర్లను వేలం వేసింది. మొన్న వాయిదా పడిన ఈ వేలం ఈ రోజు జరిగింది. ఈ వేలంలో వివిధ ఫ్రాంఛైజీలు స్టార్ ఆటగాళ్ళకు భారీ రేటును చెల్లించి పోటీపడి దక్కించుకున్నాయి. ఈ వేలంలో ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు అయిన లీచాంగ్ ని 80.10 లక్షలు చెల్లించి ముంబై మాస్టర్స్ దక్కించుకోగా, మన హైదరాబాదీ స్టార్ అయిన సైనా నెహ్వాల్ ని హైదరాబాద్ హాట్ షాట్స్ ఫ్రాంఛైజీ 71.20 లక్షలకు దక్కించుకుంది. మన మన రాష్ట్రానికి చెందిన క్రీడాకారులైన పారుపల్లి కశ్యప్ ని బంగా బీట్స్ 44.50 లక్షలు చెల్లించి సొంతం చేసుకున్నాడు. ఇదే జట్టు పి.వి. సింధును 47.50 లక్షలతో కొనుగోలు చేసింది. మన రాష్ట్రానికి చెందిన గుత్తా జ్వాల, అశ్వినీ పొన్నప్పలను ఢిల్లీ స్మాషర్స్, పుణె పిస్టన్స్ జట్లు కొన్నాయి. వీరిద్దరూ డబుల్స్ స్పెషలిస్టులు అయినా, ఐబీఎల్లో మాత్రం డబుల్స్ ఉండవు కాబట్టి వీరి బేస్ ప్రైస్ను సగానికి తగ్గించాలని ఫ్రాంచైజీలు కోరాయి. దీంతో జ్వాలకు 18.40 లక్షలు, అశ్వినికి 14.84 లక్షలు లభించాయి. అయితే, వీరిద్దరికీ మిగిలిన మొత్తం కూడా వచ్చేలా చూస్తామని ఐబీఎల్ అధికారులు అంటున్నారు. జ్వాలకు 11.29 లక్షలు, అశ్వినికి మరో 14.84 లక్షలు చెల్లిస్తారు. ఐబీఎల్ టోర్నమెంటు ఆగస్టు 14 నుంచి 31వ తేదీ వరకు దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో జరగనుంది. ఇందులో ప్రపంచంలోని 50 మంది అగ్రశ్రేణి క్రీడాకారులు ఆడతారు. మరి ఈ బీపీఎల్ టోర్నీ క్రికెట్ లాగా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more