భారత క్రికెట్ లెజెండ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ క్రికెట్ లబ్దికోసం మరిన్ని టెస్టులు ఆడింటే బాగుండేదని శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ అన్నాడు. ''అభిమానులు ఇష్టపడే సచిన్ లాంటి వ్యక్తి మరిన్ని టెస్టు మ్యాచ్‌లు ఆడింటే బాగుండేది. క్రికెట్ ఆడే సమయంలో అతను ఏవిధంగా టెస్టు క్రికెట్‌ను ప్రోత్సహించాడో రిటైర్మెంట్ తర్వాత కూడా సచిన్ అదే విధంగా ప్రోత్సహిస్తాడని భావిస్తున్నాను''అని ఎఫ్‌ఐసీసీఐ సెమీనార్ సంద ర్భంగా ఇక్కడ జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న రణతుంగ అన్నాడు. రిటైర్మెంట్‌పై క్రికెటర్ల నిర్ణయంపై రణతుంగ మాట్లాడుతూ.. రిటైర్మెంట్ నిర్ణయం తీసుకునేందుకు తనకు కేవలం మూడు రోజులు పట్టిందని చెప్పాడు.
ఆ నిర్ణయం తీసుకునే సమయంలో పార్ట్ టైమ్ పొలిటిషియన్ అని, ఇన్‌ష్యూరెన్స్ ఏజెంట్‌నని, బిజినెస్ మ్యాన్ అని చెప్పాడు. అయితే క్రికెటే సర్వస్వంగా భావించే సచిన్ విషయంలో అటువంటి నిర్ణయం తీసుకోవడం చాలా కష్టమని తెలిపాడు. అయితే షార్ట్ ఫార్మాట్‌ల ముందు టెస్టు క్రికెట్ కనుమరుగు కాకుండా సచిన్ తగిన విధంగా సహాయం చేయాలని కోరాడు. సచిన్ ఇంతగా ఎదిగినా అతను ఒక విషయంలో మార లేదని చెప్పాడు. ఒకవేళ సచిన్ 1,00,000 పరుగులు చేసినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం పోలేదని.. ఇప్పటికీ క్రికెట్ గురించే ఆలోచిస్తాడని అన్నాడు. సచిన్ మెగా స్టార్ కంటే గొప్పవాడని.. ప్రపంచ యువ క్రికెటర్లు ఆదర్శ ప్రాయుడని రణతుంగ కొనియాడాడు. ప్రపంచంలో క్రికెట్ గురించి తనెక్కడ మాట్లాడినా.. సచిన్ ప్రస్తావన వస్తుందని చెప్పాడు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more