భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) పై డబుల్స్ స్టార్ క్రీడాకారిణి గుత్తా జాల్లా నిప్పులు చెరిగింది. అంతేకాకుండా బ్యాడ్మింటన్ ఛీప్ కోచ్ గోపిచంద్ పై జ్వాలా మండిపడింది. బ్యాడ్మింటన్ ఆడేందుకు అనుమతి లభించినందుకు ఆనందంగా ఉంది. బాయ్ ఆంక్షల కారణంగా నాతో పాటు నా డబుల్స్ భాగస్వామి అశ్విని పొన్నప్ప కూడా ఇబ్బందిపడుతోంది. అసలు మహిళల డబుల్స్ విభాగం పైనే బాయ్ కక్ష గట్టినట్లుంది. కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం , ప్రపంచ ఛాంపియన్ షిప్ లో కాంస్యం సాధించిన జోడీకి ఇదేనా బాయ్ ఇచ్చే గౌరవం? బంగా బీట్స్ చివరి నిమిషంలో ఆటగాడిని మాచ్చిన సంగతి ఢల్లీ స్మాషర్స్ కు జ్వాలకు చెప్పకపోవడం తన పొరపోటేనని చీప్ రిఫరీ తన నివేదికలో స్పష్టంగా పేర్కొన్నాడు.
అయినా.. జ్వాల క్షమాపణ చెబితే జీవితకాల నిషేదం నుంచి మినహాయించొచ్చని సూచించాడు. నేనేమైనా డోపింగ్ కు పాల్పడ్డానా? మ్యాచ్ ల్ని ఫిక్స్ చేశానా? హత్య చేశానా? జీవిత కాల నిషేదం లాంటి పెద్ద పదాలు ఎందుకు? తప్పు చేయనప్పుడు ఎందుకు క్షమాపణ చెప్పాలి? క్షమాపణ చెబితే ఏ తప్పు చేసినా వదిలేస్తారా? అని జ్వాలా మండిపడింది. ఓ తెలుగు క్రీడాకారిణికి అన్యాయం జరుగుతున్నా బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ గోపీచంద్ ఎందుకు స్పందించడం లేదని డబుల్స్ స్టార్ గుత్తా జ్వాల ప్రశ్నించింది.
అయితే సొంత రాష్ట్రానికే చెందిన కోచ్ గోపీచంద్ మాత్రం ఇప్పటిదాకా ఈ విషయంలో స్పందించింది లేదు. ఆయన నాకెందుకు మద్దతివ్వడం లేదో? నాకు తెలియదు. అయితే నేను ఈ వారం డెన్మార్క్ బయలు దేరాల్సి ఉండగా బాయ్ నుంచి ఇప్పటిదాకా సమాచారం లేదు’ అని జ్వాల తెలిపింది. కానీ చైనా ఓపెన్‌కు కూడా నా ఎంట్రీని పంపలేదని అశ్విని పొన్నప్ప చెప్పింది. ఇప్పటిదాకా నా సొంత డబ్బులతోనే టోర్నీలను ఆడుతున్నాను. అయినా కూడా నన్ను ఆడనీయడం లేదు. అసలు మీరెవరు నన్ను అడ్డుకునేందుకు? నేనెవరికీ అడ్డు రావడం లేదు. నా సొంత డబ్బులతోనే నేను ఆడుతున్నాను. నాకు బ్యాడ్మింటనే జీవితం.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more