Saina nehwal and pv sindhu out from denmark open super series

saina nehwal, pv sindhu, badminton srikanth, saina nehwal latest news, saina nehwal badminton, saina nehwal updates, saina nehwal news, saina nehwal hot photo shoot, saina nehwal denmark open, pv sindhu latest news, pv sindhu denmark open, badminton star srikanth, srikanth denmark open, parupalli kashyap news, parupalli kashyap denmark open

the indian badminton stars saina nehwal and pv sindhu came out from denmark open super series

ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్లుంది సైనా, సింధు తీరు!

Posted: 10/18/2014 01:28 PM IST
Saina nehwal and pv sindhu out from denmark open super series

భారత బ్యాడ్మింటన్ స్టార్స్ అయిన సైనా నెహ్వాల్, పివి సింధుల తీరులో రానురాను చాలా మార్పులు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో తమ ప్రతిభతో విశ్వవ్యాప్తంగా ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ఇద్దరు ఆటగాళ్లూ.. ఇప్పుడు భారతీయ అభిమానులను తీవ్రనిరాశకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవలే జరిగిన ఆసియా క్రీడల్లోనూ ఈ ఇద్దరూ క్రీడాకారిణులు మొదటిలోనే భారత్ కు వెనుదిరిగిరావడం అందరినీ ఆశ్చర్యపరిచేసింది. పతకాలు గెలిచి, భారత్ గౌరవాన్ని కాపాడుతారని ఎన్నో ఆశలతో ఎదురుచూసిన ఫ్యాన్స్ కు చివరకు నిరాశలే మిగిలాయి. ఆ విషయాన్ని అందరూ ఎలాగోలా జీర్ణించుకోగలిగారు గానీ... తాజాగా మరోసారి వీరిద్దరు డెన్మార్క్ ఓపెన్ లో ఓడిపోయి విమర్శలను ఎదుర్కొంటున్నారు.

డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ క్రీడల్లో పాల్గొన్న సైనా నెహ్వాల్, పివి సింధులు మొదట్లో తమ అద్భుత ప్రదర్శనతో ప్రత్యర్థి ఆటగాళ్లను ముచ్చెమటలు పట్టించారు. వరుస విజయాలతో దూసుకుపోతుండగా.. టైటిల్స్ ఖచ్చితంగా గెలుస్తారనే నమ్మకాన్ని అందరూ వ్యక్తం చేశారు. చాలా తక్కువ స్కోరులోనే ప్రత్యర్థులను నిలబెట్టేసి విజయాలవైపు దూసుకుపోతుండగా.. అందరూ అనుకున్నట్లే ఈసారి ఈ ఇద్దరు క్రీడాకారిణులు పతకాలు తీసుకోస్తారని భావించారు. అయితే శుక్రవారం జరిగిన మ్యాచ్ లో భారత్ కు చేదు అనుభవాలే ఎదురయ్యాయి. క్వార్టర్ ఫైనల్లోకి చేరిన మొత్తం నలుగురు బ్యాడ్మింటన్ ఆటగాళ్లలో ఒకేసారి ముగ్గురు టోర్నీ నుంచి నిష్ర్కమించబడ్డారు. అందులో సైనా, సింధులు వుండటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగింది.

మొదట్లో భారీ స్కోరుతో ప్రత్యర్థులను మట్టికరిపించిన ఈ ఇద్దరు బ్యాడ్మింటన్ స్టార్స్.. క్వార్టర్ లో మాత్రం గెలుపుఅంచులదాకా వెళ్లి వెనుదిరిగారు. మహిళల సింగిల్స్ క్వార్టర్స్ లో ఏడో సీడ్ సైనా నెహ్వాల్, చైనాకు చెందిన రెడో సీడ్ షిజియాన్ వాంగ్ చేతిలో 20-22, 15-21 స్కోరుతో పరాజయం పాలయ్యింది. అలాగే పివి సింధు కూడా కొరియాకు చెందిన నాలుగో సీడ్ హ్యాన్ సంగ్ చేతిలో 17-21, 19-21 స్కోరుతో ఓటమి చవిచూసింది. ఇక పురుషుల క్వార్టర్స్ లో శ్రీకాంత్ 21-23, 17-21 స్కోరుతో కొరియాకు చెందిన ఏడో సీడ్ వాన్ హౌ సన్ చేతిలో ఓడిపోయాడు. దీంతో ముగ్గురు ఒకేసారి టోర్నీ నుంచి నిష్ర్కమించడంతో ఇక క్వార్టర్స్ లో కశ్యప్ మాత్రమే మిగిలి వున్నాడు. అతను కూడా వెనుదిరుగుతాడా లేదా గెలుస్తాడా అన్నది మాత్రం చెప్పలేని పరిస్థితి!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles