బ్యాడ్మింటన్ స్టార్ సానియా మీర్జా ఏ తీర్థంలో జలకమాడిందో తెలీదు కానీ.. యూఎస్ ఓపెన్ నుంచి ఈ అమ్మడు తన తడాఖా చూపించుకుంటూ ప్రత్యర్థుల్ని దుమ్ములేపేస్తోంది. అంతకుముందు తొలిరౌండ్లలోనే వెనుదిరిగి భారతీయ అభిమానులను నిరాశపరిచే ఈ అమ్మడు.. నేడు ప్రపంచవ్యాప్తంగా టాప్ ర్యాంకర్లను సైతం చెమటలు పట్టించేస్తోంది. మహిళల డబుల్స్, సింగిల్స్.. ఇలా అన్ని విభాగాల్లోనూ తనదైన ప్రతిభతో ఈ అమ్మడు సమర్థవంతంగా విజయబాటవైపు అడుగులు వేస్తోంది. తాజాగా మరోసారి ఈ అమ్మడు తన జైత్రయాత్రను కొనసాగించింది.
జింబాబ్వేకు చెందిన కార్లా బ్లాక్ తో కలిసి తొలిసారి డబ్ల్యూటీఏ ఫైనల్స్ డబుల్స్ బరిలో దిగిన సానియా.. ఏకంగా సెమీఫైనల్ కు దూసుకెళ్లింది. గురువారం హోరాహోరీగా జరిగిన క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ సానియా జోడీ 6-3, 2-6, 12-10 స్కోరుతో రాక్వెల్ కావ్స్ జోన్స్, అబిగైల్ స్పియర్స్ (అమెరికా) జంటపై భారీగా గెలుపొందింది. దీంతో శనివారం జరిగే సెమీస్ లో సానియా - బ్లాక్ జోడీ.. క్వెటా పెచ్ కె (చెక్), కేతరీన స్రెబోత్నిక్ (స్లోవేనియా) జంటతో తలపడనుంది. అలాగే ఏడాది చివర్లో జరిగే డబ్ల్యూటీఏ ఫైనల్స్ లో.. ప్రపంచంలోని టాప్-8 క్రీడాకారిణులు సింగిల్స్, టాప్-8 డబుల్స్ టోర్నీలో తలపడుతాయి.
AS
(And get your daily news straight to your inbox)
Feb 26 | రష్యా టెన్నిస్ స్టార్ మారియా షరపోవా ఆటకు గుడ్‌బై చెప్పారు. క్రీడా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ స్టార్ ప్లేయర్.. ఇవాళ రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ మేరకు... ‘‘28 ఏళ్ల తర్వాత..... Read more
Aug 27 | 20 సార్లు గ్రాండ్‌స్లామ్ విజేత, ప్రపంచ మాజీ నెంబర్‌వన్, స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌కు యూఎస్ ఓపెన్‌లో ఊహించని షాక్ తగిలింది. అయితే వెంటనే కొలుకున్నాడు కానీ.. తొలి సెట్ మాదిరిగానే మిగతా మ్యాచ్... Read more
Sep 10 | యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ లో ఓడిమిని చవిచూడటంతో.. అంపైర్ పై విరుచుకుపడిన అమెరికా క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ పై టోర్నమెంట్ రిఫరీ కార్యాలయం భారీ జరిమానా విధించిన నేపథ్యంలో అమె చేసిన... Read more
Jul 10 | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) క్రికెట్ లో అద్భుతమైన ఆట కనబర్చిన క్రికెటర్లకు ర్యాంకులు కేటాయించే విషయం ప్రతీ క్రికెట్ అభిమానికి తెలిసిందే అయితే తాజాగా ఐసీసీ ఓ టెన్నిస్ సూపర్ స్టార్ కి టెస్టుల్లో... Read more
Apr 13 | పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లాడి ఎనమిది వసంతాలు పూర్తి చేసుకున్న టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను ఓ వ్యక్తి నీ దేశం ఏదీ అంటూ ప్రశ్నించి.. అమె అగ్రహానికి గురయ్యాడు. అంతేకాదు... Read more