Sania Mirza Dubsmash With Husband Shoaib Malik | Pakistan Cricketers | Sri Lanka

Sania mirza dubsmash husband shoaib malik pakistan cricketers

sania mirza, sania mirza dubsmash, sania mirza steps with pak cricketers, sania mirza with husband, sania with shoaib malik, sania mirza controversy, shoaib malik latest news, pakistan cricketers, srilanka team

Sania Mirza Dubsmash Husband Shoaib Malik pakistan cricketers : Tennis' golden Sania Mirza celebrate a win with her husband Shoaib Malik and team party right after their latest victory over Sri Lanka.

పాక్ క్రికెటర్లతో చిందులేసిన సానియా

Posted: 07/21/2015 11:26 AM IST
Sania mirza dubsmash husband shoaib malik pakistan cricketers

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇండియా అభిమానులకు షాక్ తగిలేలా పాక్ క్రికెటర్లతో కలిసి చిందులేసింది. పైగా.. తాను చిందేసిన ఆ వీడియోని నెట్ లో అప్ లోడ్ చేసింది కూడా! ఇప్పుడు ఆ వీడియో ఇంటర్నెట్ లో తెగ హల్ చల్ చేస్తోంది. ఇంతకీ సానియా అలా పాక్ క్రికెటర్లతో ఎందుకు స్టెప్పులేసింది..? అనేగా సందేహం! ఆ వివరాలు తెలియాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే!

కొలంబో వేదికగా ఆదివారం శ్రీలంక, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ లో పాక్ జట్టు నెగ్గి, సిరీస్ ని చేజిక్కించుకుంది. దీంతో పాక్ జట్టు ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. ఇక ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు కొలంబో వెళ్లిన సానియా కూడా.. పాక్ జట్టు గెలుపొందడంతో ఆ జట్టుతో కలిసి చిందులేసింది. సానియా వారితో కలిసి చిందులేసిన డబ్ స్మాష్ వీడియో ప్రస్తుతం నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఆమె తన భర్త షోయబ్ తోపాటు పాక్ క్రికెటర్లతో కలిసి కనిపించింది. తమ జట్టు విజయం సాధించిన సంతోషంలో మాలిక్, సానియ దంపతులు ఆ జట్టు సభ్యులతో కలిసి ‘అభీతో పార్టీ షురూ హుయీ హై’ అనే పాటకు డబ్ స్మాష్ వీడియో చిత్రీకరించారు. ఇప్పుడు ఈ వీడియో మీద తీవ్రస్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయి.

ఆ వీడియోని వీక్షించిన నెటిజన్లు.. ఇండియాకు చెందిన సానియా పాక్ ఆటగాళ్లతో స్టెప్పులేయడం ఏంటని ప్రశ్నలు సంధిస్తున్నారు. మరికొందరు మాత్రం సానియా అలా చిందులేయడంలో తప్పులేదని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే.. పాక్ జట్టులో సానియా భర్త షోయబ్ మాలిక్ కూడా వున్నాడు కాబట్టి!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sania mirza  shoaib malik  pakistan cricketers  

Other Articles