ప్రతిష్మాత్మకమైన వింబుల్డన్ వుమెన్ డబుల్స్ టైటిల్ ను తన భాగస్వామి క్రిస్టినా హింగిస్ తో కలసి గెలుచుకున్న ఆనందంలో వున్న సానియా మిర్జా.. తన ఆట ద్వారా ప్రపంచ టెన్నిస్ అభిమానులను చూరగొంది. ఆ తరువాత పాకిస్థాన్ వన్డేలో విజయం సాధించడంతో ఇటీవల తన భర్తతో కలసి డాన్స్ కూడా చేసింది. ఈ వీడియో క్లిప్ ను స్వయంగా ఆమె భర్తే అప్ లోడ్ చేయడం.. దానిపై సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చివరకు యవరాజ్ సింగ్ మైకిల్ జాక్సన్ మూన్ డాన్స్ చేయడం.. ఇలా అన్ని జరిగిపోయిన తరువాత ఇప్పుడు సానియా మిర్జా మరో కొత్త అవతార ఎత్తనుంది.
అదేంటి అనుకుంటున్నారా..? అమె ర్యాంప్ వ్యాక్ చేయనుంది. గతంలో కూడా అనేక పర్యాయాలు అమె ర్యాంప్ వ్యాక్ చేసింది కదా..? ఇందులో గోప్పదనం ఏమిటంటారా..? ఇంతకు ముందు అమె చేసినవన్నీ ఫ్యాషన్ కు సంబంధించినవి కాగా, ఈ సారి అమె చేయబోయే ర్యాంప్ వాక్ ఆభరణాలకు సంబంధించినది. ముంబైలో జరగనున్న ఇండియన్ ఇంటర్నేషనల్ జ్యువెలరీ వీక్ (ఐఐజేడబ్యూ) 2015లో భాగంగా సానియా ఈ కార్యక్రమంలో ర్యాంపుపై హోయలు ఒలికేందుందుకు సిద్దంగా వుంది.
మోనీ అగర్వాల్ నిర్వహించే ఈ ఈవెంట్లో పలు రకాల నగల డిజైన్లను సానియా ధరించి ప్రదర్శించనుంది. ఈ నగరలను సానియా ఖచ్చితంగా అద్భుతంగా ప్రధర్శించగలరని నిర్వహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ షోకు అమె టాపర్ గా నిలవనుందని తెలిపారు. ఈ షోలో ప్రస్తుతం మహిళలకు ఎటువంటి డిజైన్లు అవసరమో వాటినే తాము రూపోందించామని తెలిపారు. తాను పడ్డ కష్టాన్ని ఈ ఈవెంట్ ద్వారా నిరూపించుకోవాలని భావిస్తున్నట్లు అగర్వాల్ తెలిపారు. ఐఐజేడబ్యూలో తాను పాల్గోనడంతో పాటు తన కలెక్షనల్ను ప్రదర్శించబోతున్నందుకు చాలా సంతోషంగా వుందని అగర్వాల్ ఉద్వేగంతో అన్నారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Feb 26 | రష్యా టెన్నిస్ స్టార్ మారియా షరపోవా ఆటకు గుడ్‌బై చెప్పారు. క్రీడా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ స్టార్ ప్లేయర్.. ఇవాళ రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ మేరకు... ‘‘28 ఏళ్ల తర్వాత..... Read more
Aug 27 | 20 సార్లు గ్రాండ్‌స్లామ్ విజేత, ప్రపంచ మాజీ నెంబర్‌వన్, స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌కు యూఎస్ ఓపెన్‌లో ఊహించని షాక్ తగిలింది. అయితే వెంటనే కొలుకున్నాడు కానీ.. తొలి సెట్ మాదిరిగానే మిగతా మ్యాచ్... Read more
Sep 10 | యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ లో ఓడిమిని చవిచూడటంతో.. అంపైర్ పై విరుచుకుపడిన అమెరికా క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ పై టోర్నమెంట్ రిఫరీ కార్యాలయం భారీ జరిమానా విధించిన నేపథ్యంలో అమె చేసిన... Read more
Jul 10 | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) క్రికెట్ లో అద్భుతమైన ఆట కనబర్చిన క్రికెటర్లకు ర్యాంకులు కేటాయించే విషయం ప్రతీ క్రికెట్ అభిమానికి తెలిసిందే అయితే తాజాగా ఐసీసీ ఓ టెన్నిస్ సూపర్ స్టార్ కి టెస్టుల్లో... Read more
Apr 13 | పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లాడి ఎనమిది వసంతాలు పూర్తి చేసుకున్న టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను ఓ వ్యక్తి నీ దేశం ఏదీ అంటూ ప్రశ్నించి.. అమె అగ్రహానికి గురయ్యాడు. అంతేకాదు... Read more