హైదరాబాద్ టెన్నిస్ స్టార్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మిర్జాకు దేశంలోని క్రీడాకారులకు లభించే అత్యున్నత అవార్డు రాజీవ్ ఖేల్ రత్నా పురస్కారానికి ఎంపిక అయ్యింది.సానియాకు రాజీవ్ ఖేల్ రత్నా అవార్డును అందించాలని క్రీడల మంత్రిత్వ శాఖ కేంద్రానికి ప్రతిపాదించింది. శనివారం అవార్డుల కమిటీకి సానియా పేరును కేంద్ర క్రీడాశాఖ మంత్రి సర్భానంద సోనోవాల్ ప్రతిపాదన చేశారు. క్రీడా రంగంలో అధిక పతకాలు సాధించిన క్రీడాకారిణిగా సానియా ఉందని, అందుకే ఆమె పేరును ప్రతిపాదిస్తున్నామని క్రీడా శాఖ కార్యదర్శి అజిత్ శరణ్ అన్నారు.
ప్రస్తుతం తన కెరీర్ లో అత్యుత్తమ ఫామ్ కనబరుస్తున్న సానియా ఇటీవలే మార్టినా హింగిస్ తో జతకట్టి వరుస విజయాలతో దూసుకెళ్తోంది. అయితే అమె ఇటీవల సాధించిన వింబుల్డన్ మహిళల డబుల్స్ టైటిల్ ను పరిగణలోకి తీసుకోకుండానే అమెను రాజీవ్ ఖేల్ రత్నా అవార్డుకు నామినేట్ చేసింది కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ. 2014 ఏసియన్ గేమ్స్, యూఎస్ ఓపెన్‌లో మిక్స్డ్ డబుల్స్‌లో బంగారు పతకాల్ని సాధించి దేశ గౌరవాన్ని టెన్నిస్ రంగంలో నలుదిశలా ఇనుమడింప జేసినందుకు గాను అమెను ఖేల్ రత్న అవార్డుకు ప్రతిపాదించినట్లు క్రీడల శాఖ తెలిపింది.
వివిధ వేదికలపై సాధించిన విజయాలతో సానియా పేరుప్రతిష్టలు ఇనుమడించాయి. కాగా ఖేల్ రత్నకు సానియా వ్యక్తిగతంగా దరఖాస్తు చేయసుకోనప్పటికీ.. అమెకు ఈ అత్యున్నత పురస్కారం అందించాలని క్రీడా మంత్రిత్వ శాఖ కేంద్రానికి సిఫార్సు చేసింది. సానియా మిర్జాకు 2004లో అర్జున అవార్డును అందుకోగా, 2006లో పద్మశ్రీ అవార్డులను కేంద్ర ప్రభుత్వం బహుకరించింది. అయితే ఈ సారి సానియా మిర్జాతో పాటు రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు 11 మంది పోటీ పడ్డారు. ఈ పోటీలో స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్, డిస్కస్ త్రోయర్ వికాస్ గౌడ తదితరులు ఉన్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Feb 26 | రష్యా టెన్నిస్ స్టార్ మారియా షరపోవా ఆటకు గుడ్‌బై చెప్పారు. క్రీడా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ స్టార్ ప్లేయర్.. ఇవాళ రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ మేరకు... ‘‘28 ఏళ్ల తర్వాత..... Read more
Aug 27 | 20 సార్లు గ్రాండ్‌స్లామ్ విజేత, ప్రపంచ మాజీ నెంబర్‌వన్, స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌కు యూఎస్ ఓపెన్‌లో ఊహించని షాక్ తగిలింది. అయితే వెంటనే కొలుకున్నాడు కానీ.. తొలి సెట్ మాదిరిగానే మిగతా మ్యాచ్... Read more
Sep 10 | యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ లో ఓడిమిని చవిచూడటంతో.. అంపైర్ పై విరుచుకుపడిన అమెరికా క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ పై టోర్నమెంట్ రిఫరీ కార్యాలయం భారీ జరిమానా విధించిన నేపథ్యంలో అమె చేసిన... Read more
Jul 10 | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) క్రికెట్ లో అద్భుతమైన ఆట కనబర్చిన క్రికెటర్లకు ర్యాంకులు కేటాయించే విషయం ప్రతీ క్రికెట్ అభిమానికి తెలిసిందే అయితే తాజాగా ఐసీసీ ఓ టెన్నిస్ సూపర్ స్టార్ కి టెస్టుల్లో... Read more
Apr 13 | పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లాడి ఎనమిది వసంతాలు పూర్తి చేసుకున్న టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను ఓ వ్యక్తి నీ దేశం ఏదీ అంటూ ప్రశ్నించి.. అమె అగ్రహానికి గురయ్యాడు. అంతేకాదు... Read more