3rd odi called off due to rain

3rd ODI called off, due to rain, South Africa, india, south africa 301 runs, india vs south africa, live score,

South Africa posted an imposing total of 301 runs at the loss of eight wickets against India.

మూడో వన్డే వర్షార్పణం... పరువు నిలుపుకుంది

Posted: 12/12/2013 03:36 PM IST
3rd odi called off due to rain

స్వదేశంలో వరుసగా సిరీస్ లు గెలుస్తూ మంచి జోరు మీదున్న టీం ఇండియా సౌతాఫ్రికాలో గెలవడం ఖాయం అనుకున్నారంతా. కానీ అక్కడికి వెళ్తే గానీ తెలియలేదు మనవాళ్ళ సత్తా. ఇక్కడ సెంచరీలు చేసిన వారంతా అక్కడ కనీసం అర్థ సెంచరీ కాదు కదా ? పావు సెంచరీ కూడా చేయలేదు. అక్కడి బౌలర్ల ధాటికి బెంబేలెత్తిపోయారు. మొదటి రెండు వన్డేల్లో ఎలాగు ఓడిపోయారు కాబట్టి మూడో వన్డేలోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని అనుకున్నారు. కానీ అది కూడా జరగలేదు.

నిన్న జరిగిన మూడో వన్డే వర్షార్పణం అయింది. టెస్టు సిరీస్‌కు ముందు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేద్దామనుకున్న టీమిండియాకు ఆ అదృష్టమూ దక్కలేదు. ఇక్కడి సూపర్ స్పోర్ట్స్ పార్క్ మైదానంలో బుధవారం జరిగిన మూడో వన్డే లో దక్షిణాఫ్రికా పూర్తి ఇన్నింగ్స్‌ను 50 ఓవర్లు ఆడి, 8 వికెట్లు కోల్పోయి 301 పరుగుల భారీ స్కోరు చేసింది.  క్వాంటన్ డి కాక్ (120 బంతుల్లో 101; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) వరుసగా మూడో సెంచరీ సాధించగా, కెప్టెన్ ఏబీ డివిలియర్స్ (101 బంతుల్లో 109; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) కూడా శతకంతో చెలరేగాడు. చివర్లో మిల్లర్ (34 బంతుల్లో 56 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా ధాటిగా ఆడాడు.

ఇషాంత్ శర్మ (4/40) ఆకట్టుకున్నాడు.షమీకు 3 వికెట్లు దక్కాయి. ఇన్నింగ్స్ విరామంలో ప్రారంభమైన వాన నిరంతరాయంగా దాదాపు రెండున్నర గంటల పాటు కురిసింది. దాంతో మరో దారి లేక అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. నిన్న జరిగిన మ్యాచ్ లో భారత్ ఓ రికార్డు కూడా క్రియేట్ చేసిందోయ్.

అదేంటంటే ఒకే సంవత్సరంలో పదిసార్లు 300 పైగా స్కోర్లు సమర్పించుకున్న జట్టుగా రికార్డుల్లోకి ఎక్కి తన రికార్డును తానే బ్రేక్ చేసుకుంది. ఇరు జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ ఈ నెల 18 నుంచి జొహన్నెస్‌బర్గ్‌లో జరుగుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles